ఎస్సీ కులాల జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు
ప్రశ్న ఆయుధం న్యూస్ ఏప్రిల్ 14 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
కొత్తగూడెం జిల్లా కేంద్రం అంబేద్కర్134 వ జయంతి కార్యక్రమం పోస్ట్ ఆఫీస్ సెంటర్లో సోమవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు హాజరై ఏజెన్సీ ప్రాంత ఎస్సి కులాల చైతన్య యాత్ర కరపత్రం ప్రారంభించారు.ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో సగo భూభాగం ఏజెన్సీ ప్రాంత ఎస్సీ కులాలకు జడ్పీటీసీ,ఎంపీటీసీలు గత ప్రభుత్వంలో జనరల్ లో కలపడం వలన ఎస్సీ కులాలకు తీరని అన్యాయం జరిగిందని అన్నారు.ఈ సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించి ప్రభుత్వం ముందు ఉంచాను కాంగ్రెస్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఎస్సీ కులాలతోపాటు మరియు బీసీ కులాలకు జడ్పీటీసీలు ఎంపీటీసీలు అమలు చేయాలనికాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు.ఈ సందర్భంగా షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మెర శ్రీనివాస్ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అసెంబ్లీలో ప్రస్తావించడమే కాదు స్థానిక రిజర్వేషన్లు అమలయ్యేంతవరకు ఏజెన్సీ ప్రాంత షెడ్యూల్డ్ కులాలకు అండదండగా ఉండి అమలు చేయాలని కూనంనేనికి విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సిపిఎం పార్టీ కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు,షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట జేఏసీ రాష్ట్ర కో కన్వీనర్ కాకెళ్లి సైమన్,గౌరవ సలహాదారులు,మద్దెల శివకుమార్,మాజీ జెడ్పిటిసి పరంజ్యోతి రావు,అంబేద్కర్ జయంతి ఉత్సవాల కన్వీనర్ మారపాక రమేష్ కుమార్, కూసపాటి శ్రీనివాస్,బొంకూరి పరమేష్,చదలవాడ సూరి, చిన్ని,షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర కోఆర్డినేటర్ ఎనగంటి కృపాకర్,రజిని అంబేద్కర్,సలిగంటి కొమరయ్య, కత్తి బాలకృష్ణ,కండే రాములు,ఎనగంటి శ్రీను, తదితరులు పాల్గొన్నారు.