సంగారెడ్డి/పటాన్ చెరు, ఏప్రిల్ 14 (ప్రశ్న ఆయుధం న్యూస్): ప్రపంచ మేధావి డాక్టర్ బాబా సాహేబ్ అంబేద్కర్ జయంతిని పటాన్ చెరులో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, పటాన్ చెరు కార్పోరేటర్ మెట్టుకుమార్ యాదవ్, ఎస్సి.ఆర్.పి ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రుద్రారం శంకర్, నవ భారత్ నిర్మాన్ యువసేన అద్యక్షుడు మెట్టు శ్రీధర్ లు మాట్లడుతూ.. అంబేద్కర్ ఆశయ సాధనకోసం అందరూ కృషి చేయాలని, రాజ్యంగ ఫలాలు అందరికి అందాలని, రాజ్యాధికారం దిశగా బి.సి, ఎస్సి, ఎస్టీలు, మైనార్టీలు ఐక్యంగా పోరాడాలని ఓటు అనే ఆయుదాన్ని అమ్ముకోకుండా సరైన వ్యక్తులను ఎన్నుకొని అభివృద్ది పథంలో నడవాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, ప్రజాకుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
పటాన్ చెరులో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి
Published On: April 14, 2025 8:29 pm
