ఉప ఎన్నిక బరిలో
అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు చేపూరి రాజు
వనస్థలిపురం , అక్టోబర్ 18: (ప్రశ్న ఆయుధం) జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు చేపూరి రాజు నామినేషన్ దాఖలు చేసిన అనంతరం వారు మాట్లాడుతూ…. పది సంవత్సరాల బి ఆర్ ఎస్ పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కంప్లీట్ చేయలేకపోవడం దళిత బంధు స్కీము ఎలక్షన్ లో తీసుకురావడం పలు సంక్షేమ పథకాలను ఆశ చూపించి మూడోసారి అధికారంలోకి రావాలని చూసిన టిఆర్ఎస్ పార్టీకి మూడవసారి అధికారంలోకి రావాలని చూశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కరువు కాల్చి వాత పెట్టారు. 11 సంవత్సరాలుగా కేంద్రంలో బిజెపి పార్టీ ఉండి నల్లధనం తీసుకొచ్చి దేశంలో ఉన్న పేదలకు అకౌంట్లో 15 లక్షలు వేస్తామని చెప్పి భారత దేశ ప్రజలను మోసం చేసిన బిజెపి పార్టీ జీఎస్టీ తో భారతదేశాన్ని చిన్న తర, మధ్యతర పరిశ్రమలకు లూటీ చేయడం జీఎస్టీ పేరు మీద కేంద్రం సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న కేంద్రం ఇంతవరకు అమలు చేయలేకపోయింది. తెలంగాణ రాష్ట్రంలో రెండు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అంబేద్కర్ అభయస్థానం కింద 12 లక్షలు ఇస్తామని చెప్పారు. ఇంతవరకు అది అమలు చేయలేదు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పేదలకు పంచ లేకపోయిందన్నారు.