అంబేద్కర్ అందరివారు ఒక కులానికి పరిమితం చేయకూడదు

*అంబేద్కర్ అందరివారు ఒక కులానికి పరిమితం చేయకూడదు*

*ఘనంగా బాబా సాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు*

*జమ్మికుంట ఏప్రిల్ 14 ప్రశ్న ఆయుధం*

డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ అధ్యక్షతన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనoగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి మండల తహసీల్దార్ రమేష్ బాబు, పలు పార్టీల ప్రజా ప్రతినిధులు హాజరై వారు మాట్లాడుతూ భారతరత్న, బహుభాషా కోవిదుడు అంబేద్కర్ అంటే ఒక ఙ్ఞానం అని, అంబేద్కర్ అందరివాడు అని ఒక కులానికి పరిమితం చేయకూడదని రాజ్యాంగ నిర్మాత, ఓటు హక్కు అనే గొప్ప అవకాశం కల్పించిన వ్యక్తి అని పేర్కొన్నారు ఈ స్వేచ్ఛాయుత వాతావరణంలో మనం నివసిస్తున్నామంటే అంబేద్కర్ చేసిన కృషి ఆని వారు కొనియాడారు. బాబా సాహెబ్ అంబేద్కర్ ఒక కులానికి, ఒక మతానికి మాత్రమే రాజ్యాంగం రచించలేదు.అన్ని వర్గాల వారికి రాజ్యాంగంలో రచించిన ఆర్టికల్ ల ద్వారా ప్రతి ఒక్కరికి గొప్పగా ఉంటున్నామని తెలిపారు. ప్రతి పౌరునికి రాజ్యాంగ హక్కులు ఉన్నాయని తెలిపిన వ్యక్తి అని రాజ్యాంగ నిర్మాణంలో ఆయన కృషిని వారు కొనియాడారు.

అదేవిధంగా జమ్మికుంట మున్సిపల్ మాజీ చైర్మన్ తక్కెళ్ళపల్లి రాజేశ్వరరావు జమ్మికుంట పిఎసిఎస్ చైర్మన్ పొనగంటి సంపత్ డాక్టర్ బాబా సాహెబ్ అంబెద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో పోడేటి రామస్వామి,మారపెల్లి బిక్షపతి, పొనగంటి మల్లయ్య, శీలం శ్రీనివాస్, దేషిని కోటి, సుంకరి రమేష్, గుడెపు సారంగపాణి, శ్రీరామ్ శ్యామ్, కొలకని రాజు, పొనగంటి సారంగం, పాత సత్యం,సాయిని రవి, శ్రీపతి నరేష్ గౌడ్ పూదరి రేణుక శివకుమార్ గౌడ్ మండ అశోక్ గౌడ్ అంబేద్కర్ కమిటీల నాయకులు, మున్సిపల్ అధికారులు మేనేజర్ జి రాజిరెడ్డి, ఏఈ నరేష్, సీనియర్ అసిస్టెంట్ భాస్కర్, వాణీ, వార్డ్ ఆఫీసర్లు, సానిటరీ ఇన్ స్పెక్టర్ సదానందం లతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment