ప్రశ్న ఆయుధం న్యూస్ ఆగస్టు 31(మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)
మెదక్ జిల్లా శివ్వంపేట మండల పరిధిలోని పాంబండ గ్రామంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహా ఆవిష్కరణకు సెప్టెంబర్ 1న ఎమ్మార్పీ ఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ రానున్నట్లు జిల్లా అధ్యక్షుడు యాదగిరి మాదిగ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఆయన కోరారు.