Site icon PRASHNA AYUDHAM

జ్ఞానానికి ప్రతీకగా నిలిచిన వ్యక్తి అంబేద్కర్ – అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

IMG 20241206 WA0262

నిజామాబాద్ జిల్లా (ప్రశ్న ఆయుధం)
నిజామాబాద్ డిసెంబర్ 07:

నిజామాబాద్ నగరంలో డా. బాబా సాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్బంగా భారతీయ జనతా పార్టీ ఎస్సి మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇందూర్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. మొదట పులంగ్ లోని అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది, అనంతరం బిజెపి జిల్లా కార్యాలయంలో బిజెపి నాయకులు కర్తకర్తలతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది..

ఈ సందర్బంగా ఎమ్మెల్యే ధన్ పాల్ మాట్లాడుతు అంబేద్కర్ గారు ఒక జాతికి నాయకుడు కాదని అంతర్జాతీయ నాయకుడిగా ఈ రోజు ప్రపంచ దేశాలు సైతం గౌరవించే ఒక శక్తిగా అంబేద్కర్ గారు ఏదగడం భారతీయులుగా మనం గర్వించదగ్గ విషయం అన్నారు. ప్రపంచంలో అతి పెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రచించి జ్ఞానానికి ప్రతికగా నిలిచిన వ్యక్తి అంబేద్కర్ గారని అటువంటి మహనీయున్ని స్వయంగా ఐక్యరాజ్య సమితి సింబల్ ఆఫ్ నాలెడ్జ్ గా గుర్తించడం జరిగిందన్నారు.

అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే తమకు పవిత్ర గ్రంధం అని అంబేద్కర్ గారు కల్పించిన హక్కుతోనే తను ఎమ్మెల్యే గా సేవచేయడం జరుగుతుందని,ఆ హక్కులతోనే కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడిందని అన్నారు

బిజెపి ప్రభుత్వం అంబేద్కర్ గారి పేరు, ప్రతిష్టలు ప్రపంచదేశాలకు విస్తరించే విదంగా పంచాతిర్దల పేరుతో అతని పుట్టుక దగ్గర నుండి ఆయన గడిపిన ప్రదేశలన్ని పంచతీర్ధల పేరుతో ఐదు క్షేత్రాలను అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు

అంబేద్కర్ గారు కలలు కన్నట్లు వారి ఆశయాలకు అనుగుణంగా బిజెపి అధికారంలోకి వచ్చాక బడుగు బలహీన వర్గాలకు సమూచిత న్యాయం కల్పించడం జరుగుతుందని అందులో భాగంగా ఒక మైనారిటీ వ్యక్తి అబుల్ కలామ్ గారిని, దళిత సామజిక వర్గం నుండి రామ్ నాథ్ కోవిద్ గారిని, గిరిజన సామజిక వర్గం నుండి ద్రౌపతి మూర్మ్ గారిని రాష్ట్రపతి చేసిన ఘనత బిజెపిదని అన్నారు

అంబేద్కర్ గారి ఆశయాలకు, ఆకాంక్షాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు పోతుందని ప్రతి పౌరుడు అంబేద్కర్ గారిని వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని సూచించారు
ఈ కార్యక్రమంలో బిజెపి కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version