Headlines
-
“అంబేద్కర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం ఘనంగా”
-
“మద్దెల శివకుమార్ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలపై ప్రస్థావన”
-
“రాజ్యాంగ దినోత్సవం: అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన మద్దెల శివకుమార్”
-
“కుల నిర్మూలన, సమతా వాదం పై ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ కీలక ప్రసంగం”
-
“రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ ఆశయాలకు కట్టుబడి పోరాడాలని పిలుపు”
ప్రశ్న ఆయుధం న్యూస్ నవంబర్ 26 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
భారతరత్న అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే భారతదేశంలో
సామాజిక న్యాయం ,సమ సమాజ స్థాపన, సమగ్రాభివృద్ధి!
భారతర రత్నఅంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ కొనియాడారు.
భారతదేశంలో, ప్రజలందరూ సమైక్యంగా, ప్రజాస్వామిక విలువలకు కట్టుబడి, దేశం సమగ్రాభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నదంటే కేవలం భారత రాజ్యాంగం వల్లనే సాధ్యమైందని. మద్దెల పేర్కొన్నారు.భారతదేశానికి దశదిశ నిర్మాణం,
సమైక్యత సమగ్ర అభివృద్ధి కేవలం భారత రాజ్యాంగం ద్వారానే సిద్ధిస్తుందని అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు, అభ్యుదయ కళాసేవ సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కవి సినీగీత రచయిత గాయకులు సమాజసేవకులు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ ఉద్ఘాటించారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం పట్టణ పోస్ట్ ఆఫీస్ సెంటర్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి,
ఘనంగా నివాళులు అర్పించారు.
అంబేద్కర్ ఎన్నో త్యాగాలు చేసి తన అపరిమిత మేదస్సుతో , విభిన్న కోణాలలో, అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరిగే విధంగా, ఆర్థిక అసమానతలు వివక్షతలకు తావు లేకుండా, ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడే విధంగా రూపొందించడం వల్లనే ఈ రోజున భారతదేశంలో శాంతి సమైక్యతలతో సమగ్ర అభివృద్ధి దిశగా పయనిస్తున్నదని, భారత రాజ్యాంగం లేకపోతే భారతదేశానికి మనగడే లేదని అన్నారు.
భారత రాజ్యాంగం పూర్తి చేయడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ కి రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజులు సమయం పట్టిందని, ఈ రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ 1949 సంవత్సరం నవంబర్ 26న ఆమోదించడం జరిగిందని అందువలన నవంబర్ 26వ తేదీన మన దేశమంతా రాజ్యాంగ దినోత్సవాన్ని ఎంతో ఘనంగానూ గర్వంగాను జరుపుకుంటుందని ప్రశంసించారు.
కులాల పేరిట అన్ని రాజకీయ పార్టీలు,
అందరూ ప్రజాప్రతినిధులు కులాలుగా విడదీసి కుల భోజనాలను ప్రోత్సహిస్తూ, కమ్మ కుల భోజనాలని బ్రాహ్మణ కులభోజనాలని రెడ్డి కులభోజనాలని పద్మశాలి కులభోజనాలని యాదవ కులభోజనాలని కాపు కులభోజనాలని రజక కులభోజనాలని మాల కులభోజనాలని మాదిగ కులభోజనాలని ఈ విధంగా విచ్చిన్నమై భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడుస్తూ, బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు ఉచ్చరించడానికి కూడా అర్హత లేని వారు తామే నిజమైన అంబేద్కర్ వాదులుగా చలామణి అవుతున్నారని ఇది సిగ్గుచేటని ఆచార్య డాక్టర్ మద్దెల ఆవేదన వ్యక్తం చేశారు.
భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ కుల వాది కాదని కుల నిర్మూలన వాది అని, ఒక కులం పునాదుల మీద జాతిని నిర్మించలేమని బాబాసాహెబ్ సెలవిచ్చారని, అటువంటి మానవతావాదిని సమతా వాదిని సంస్కరణ వాదిని
సంకుచిత మనస్తత్వంతో కొందరు స్వార్థపరులు ఆయనను ఒక కులానికి చెందిన వాడిగా ఆపాదించడం చారిత్రాత్మక తప్పిదమని,
బాబా సాహెబ్ అంబేద్కర్ విశ్వజననీయ నాయకుడని, ఈనాడు అన్ని ఇజాలు ఓటమి పాలు అయినాయని కానీ ప్రపంచవ్యాప్తంగా నేడు కేవలం అంబేద్క రిజమే వర్ధిల్లుతున్నదని ,
కొందరు అగ్రవర్ణ దురహంకారులు స్వార్థపరులు రాజ్యాంగాన్ని నిర్వీర్య పరచాలని కుట్రలు పన్నుతున్నారని, అట్టివారు చరిత్రలో మిగలకుండా మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఆచార్య డాక్టర్ మద్దెల హెచ్చరించారు
అందుకని బడుగు బలహీన వర్గాలు నిమ్నజాతులు
బాబా సాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలకు కట్టుబడి, అభ్య సించు బోధించు సమీకరించు పోరాడు అనే నినాదానికి, పే బ్యాక్ టు ద సొసైటీ అనే నినాదానికి,
వర్ణాంతర వివాహా లను ప్రోత్సహించాలి అనే నినాదానికి , రాజ్యాధికారం అనే నినాదానికి కట్టుబడి పని చేసినప్పుడే బాబా సాహెబ్ అంబేద్కర్ గారికి నిజమైన నివాళులర్పించినట్లు అని ఆచార్య డాక్టర్ మద్దెల పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ తోబాటు , సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా హనుమంతు, గౌరవాధ్యక్షులు కాకెల్లి సైమన్, గౌరవ సలహాదారులు ఆర్ దేవయ్య, మాల మహానాడు జిల్లా అధ్యక్షులు పూల రవీందర్, అంబేద్కర్ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొప్పరి నవతన్, మరొక ఉపాధ్యక్షులు వరప్రసాద్, సంయుక్త కార్యదర్శి కత్తి బాలకృష్ణ , ఆళ్లపల్లి మండల అధ్యక్షుడు సుధాకర్,
సతీష్ తదితరులు పాల్గొన్నారు