Headlines:
-
అంబేడ్కరైట్ నాయకులతో సునీల్ కుమార్ రెడ్డి భేటీ
-
ముంబై వలసజీవుల సమస్యలపై చర్చించిన కాంగ్రెస్ నేత
ముంబై వలసజీవులు ఎదుర్కొంటున్న పలు సామాజిక రాజకీయ అంశాల పట్ల కాంగ్రెస్ పార్టీ క్రియశీల నాయకులు ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి తో ముంబై స్థానిక అంబేడ్కరైట్ నాయకులు చర్చా కోసం భేటీ ఐయ్యారు. ఆదివారం సాయంత్రం జిల్లా నిజమాబాద్ మోర్తాడ్ మండలంలోని సునీల్ కుమార్ నివాసంలో సమావేశం జరిగింది. అందులో డాక్టర్ అంబేడ్కర్ యువజన సంఘం (రిజీ నం:201) జిల్లా అధ్యక్షులు ఇత్వా పేట్ లింగన్న ఉరఫ్ డి.ఎల్ మాలజీ, ప్రఖ్యాత కవివర్యులు బుయ్య కవిరాజా, పాలెం అంబేడ్కర్ యువజన సంఘం మాజీ అధ్యక్షులు గౌతమ్ మాలజీ, ముంబై నుంచి ప్రత్యేకంగా విచ్చేసిన ప్రముఖులు మూలనివాసి మాలజీ తదితరులు పాల్గొన్నారు. దీపావళి సెలవుల్లో తమ నియోజకవర్గంలోని ముంబైకర్లు ఎదుర్కొంటున్న రైళ్ల రాకపోకల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలని సునీల్ కుమార్ ను కోరడం జరిగింది. దానితో పాటు “మోర్తాడ్ రైల్వే స్టేషన్ కు మహాత్మ జ్యోతిరావు ఫూలే” పేరున నామకరణ కోసం పార్టీపరంగా లేదా అధికారంలో ఉన్న ప్రభుత్వపరంగా కృషి చేయాల్సిందిగా ఆయనకు ప్రతినిధులు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. వీటి పట్ల కాంగ్రెస్ నేత సునీల్ కుమార్ సానుకూలంగా స్పందించారని పత్రిక ప్రకటన ద్వారా తెలిపారు..