వ్యవసాయ చెక్ పోస్ట్ ను తనిఖీ చేసిన ఏఎంసీ చైర్మన్
ప్రశ్న ఆయుధం 14 జూలై (బాన్సువాడ ప్రతినిధి)
మద్నూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ చెక్ పోస్ట్ ను ఏఎంసీ చైర్మన్ అయిల్వార్ సౌజన్య రమేష్ ఆకస్మిక తనిఖీ చేశారు. చెక్ పోస్ట్ కార్యాలయంలో పలు రిజిస్టర్లను తనిఖీ చేసి ఎప్పటికప్పుడు ప్రతి ఒక్క బండి నెంబర్లను రిజిస్టర్ లో నమోదు చేయాలని ఆమె తెలిపారు.ఈ కార్యక్రమం లో ఆమె వెంట మార్కెట్ కమిటీ సిబ్బంది కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.