Site icon PRASHNA AYUDHAM

మంద కృష్ణ మాదిగను కలిసిన ఏఎంసీ చైర్మన్

IMG 20250418 WA0042

*మందకృష్ణ మాదిగ ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించిన జమ్మికుంట ఏఎంసి చైర్ పర్సన్ పుల్లూరి స్వప్న*

*జమ్మికుంట ఏప్రిల్ 18 ప్రశ్న ఆయుధం*

హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని ఉమామహేశ్వర గార్డెన్స్ లో పుల్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన పుల్ల ఫ్యామిలీస్ ఆత్మీయ సమ్మేళనానికి బాజీ హాజరైన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగను జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం ఎస్సీ వర్గీకరణ సాధించిన సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ గత 30 సంవత్సరాల క్రితం రిజర్వేషన్ పోరాట సమితి స్థాపించి మాదిగ జాతికి విద్య ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్లలో జరుగుతున్న అన్యాయాన్ని ఊరు ఊరున వాడ వాడన తిరిగి సైకిల్ యాత్రల పాదయాత్రలు రిలే నిరాహార దీక్షలు ఆమరణ దీక్షలు రైలు రోకోలు రాస్తారోకోలు అనేక అవమానాలు జరిగినప్పటికీ వెనకడుగు వెయ్యకుండా వారు చేస్తున్నటువంటి ఉద్యమాల ద్వారా మాదిగ జాతిని చైతన్యం చేసి అనేక ఉద్యమాలు చేశారనీ అన్నారు. షెడ్యూల్ కులాల ఎస్సీ వర్గీకరణ విషయంలో గత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో అనేక అవమానాలు ఇబ్బందులు నిర్బంధాలు అనేక కేసులు జైల్లో పెట్టినప్పటికీ కూడా అధైర్య పడకుండా తన కుటుంబాన్ని సైతం విడిచిపెట్టి భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు తిరిగి మాదిగ జాతి ప్రజలను చైతన్యం చేసి షెడ్యూల్ కులాల ఎస్సీ వర్గీకరణ న్యాయమైన డిమాండ్ అని సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లను ఒప్పించి మెప్పించి రెండు తెలుగు రాష్ట్రాల అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదింపజేసిన ఘనత మందకృష్ణ మాదిగకే దక్కిందన్నారు. మాదిగ జాతి మొత్తం మందకృష్ణ మాదిగకు రుణపడి ఉంటారని షెడ్యూలు కులాల ఎస్సీ వర్గీకరణ తొలి ఫలితమే తమ కుటుంబానికి జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ చైర్ పర్సన్ గా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గం ఇన్చార్జి ఒడితల ప్రణవ్ బాబు అవకాశం కల్పించారని వారికి తమ కుటుంబం ఎల్లవేళలా రుణపడి ఉంటామని అన్నారు. వికలాంగుల కోసం వితంతువుల కోసం చిన్న పిల్లలు గుండె జబ్బులతో ఇబ్బంది పడుతున్న విషయాలను అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రవేశపెట్టించి చిన్నపిల్లలకు ఉచిత గుండె ఆపరేషన్ చేపించి వితంతులకు వికలాంగులకు పెన్షన్స్ పెరుగుదల సౌకర్యం కల్పించిన ఘనత మందకృష్ణ మాదిగకు దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో మహాజన సోషలిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ ఇంజం వెంకట్ స్వామి జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎగ్గెటి సదానందం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంబాల రాజు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version