Site icon PRASHNA AYUDHAM

అమీన్ పూర్, బొల్లారం పోలీస్ స్టేషన్లను తనిఖీ జిల్లా ఎస్పీ

IMG 20250324 201118

Oplus_131072

సంగారెడ్డి ప్రతినిధి, మార్చి 24 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్, బొల్లారం పోలీసు స్టేషన్ లను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాల పరిశుభ్రతను, స్టేషన్ రికార్డులను తనిఖీ చేశారు. అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల చేదనకు ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని, ప్రతి కేసులో నాణ్యమైన, ఇన్వెస్టిగేషన్ చేయాలని యస్.హెచ్.ఓలకు సూచనలు చేశారు. జిల్లాలో పటాన్ చెరు సబ్-డివిజన్ ప్రాంతాలలో అధికంగా సైబర్ నేరాలు జరుగుతున్నాయని, సైబర్ క్రైమ్స్ నివారణ గురించి వివిధ పాఠశాలలు, కళాశాలలో మరియు సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు. సులభ మార్గంలో అధిక డబ్బులు సంపాధించాలనే అత్యాశతో యువత ఆన్లైన్ బెట్టింగ్స్ ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ.. సైబర్ మోసగాళ్ళ పన్నిన వలలో పడుతున్నారని, ఈస్సీ మనీ అనేది సైబర్ నేరగాళ్ల పన్నాగం అని గుర్తించాలని అన్నారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ఉద్యోగుల తాకిడి, స్కూల్స్, కళాశాలల బస్సుల వలన అధిక ట్రాఫిక్ రద్దీ మరింత పెరిగి వాహనదారులు ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కుంటున్నారని, దీనిని అధిగమించడానికి ప్రధాన కూడళ్లలో ఫ్రీ లెఫ్ట్ ఏర్పాటు చేయడం, సంబంధిత అధికారులతో మాట్లాడి బోలార్డ్స్ వేయించాలని అన్నారు. ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ లో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు నిర్వహించాలని సూచించారు. అదేవిధంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, యస్.హెచ్.ఓకు పలు సూచనలు చేశారు.

Exit mobile version