అమిత్ షా హెలికాప్టర్లో తనిఖీలు
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఇటీవల ఉద్దవ్ ఠాక్రే బ్యాగులను పలుమార్లు అధికారులు తనిఖీ చేశారు.
తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా హెలికాప్టర్లోనూ తనిఖీలు చేసి బ్యాగులను పరిశీలించారు. అయితే ఎన్నికల అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ
ఉద్ధవ్ తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో అమిత్
షా హెలికాప్టర్లో తనిఖీలు చేపట్టడం ప్రాధాన్యత
సంతరించుకుంది.