ప్రశ్న ఆయుధం డిసెంబర్ 21: బాల్కొండ మండలం ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ అదేశాలమేరకు ఈరోజు బాల్కొండ మండల కేంద్రంలో కేంద్ర మంత్రి అమిత్ షా పార్లమెంట్ లో భారత రాజ్యాంగ నిర్మాత డా.అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా DSP బాల్కొండ మండల కమిటీ ఆధ్వర్యంలో డా.అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి,పూలమాలలు వేసి నల్ల బ్యాడ్జిలతో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అనంతరం మండల అధ్యక్షుడు నిశాంత్ మాట్లాడుతూ అమిత్ షా ను తక్షణమే కేంద్ర మంత్రి నుండి బర్తరఫ్ చేయాలని , బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు.జై శ్రీరామ్ అంటే సనాతన ధర్మం వస్తుంది, డా.అంబేద్కర్ అంటే భారత రాజ్యాంగం అమలవుతుంది అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మురళి,మండల నాయకులు రంజీత్,ఆత్మ గౌరవ్,కౌశిక్,రుచిత్,ఆకాష్,ఆదర్శ్ పాల్గొన్నారు
అమిత్ షా ను తక్షణమే కేంద్ర మంత్రి నుండి బర్తరఫ్ చేయాలి..!
Published On: December 21, 2024 3:26 pm