అమిత్ షా రాజీనామా చేయాలి

అమిత్ షా రాజీనామా చేయాలి

ఎస్సీ ఎస్టీ అడ్వకేట్ అసోసియేషన్ సిద్దిపేట

సిద్దిపేట డిసెంబర్ 19 ప్రశ్న ఆయుధం :

సాక్షాత్తు పార్లమెంటు సాక్షిగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన దానికి నిరసనగా ఎస్సీ ఎస్టీ అడ్వకేట్ అసోసియేషన్ సిద్దిపేట కమిటీ ఆధ్వర్యంలో కోర్టు నుండి అంబేద్కర్ చమాన్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ అడ్వకేట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కర్రోళ్ళ రవిబాబు న్యాయవాది మాట్లాడుతూ అరే బాయ్ అమిత్ షాజీ ముమ్మాటికి మా భగవానుడు బాబా సాహెబ్ అంబేద్కరే మీరన్నట్టుగా ఏ భగవానుడు కూడా ఈ దేశ ప్రజలందరి బతుకులు మార్చలేకపోయారు కానీ ఈ దేశ అట్టడుగు వర్గాల ప్రజలని వేల సంవత్సరాలుగా అణిచివేసి ఎలాంటి అభివృద్ధికి నోచుకోకుండా బానిసత్వంలోకి నెట్టివేసిన చరిత్ర మీ భగవానులది మీది మీ అగ్రవర్ణ సమాజానిది చివరికి మీరు నిరంతరం పలుకుతున్నా రామ నామం కూడా ఆ శ్రీరాముడు కూడా ఈ దేశ అట్టడుగు వర్గాల ప్రజల బతుకులను ఏమాత్రం మార్చలేకపోయాడు కానీ నిజంగా మీరన్నట్టే దేవుడు అంబేద్కర్ ఈ కోట్లాది పీడిత వర్గాల ప్రజల తలరాతల ను చివరికి మీ తలరాతల ను కూడా భారత రాజ్యాంగం అనే పవిత్ర గ్రంథం ద్వారా ఈ దేశ తల రాతనే మార్చినటువంటి ఘనుడు ఈ పని చేయటానికి మీ అగ్రవర్ణాలలో ఎవడు లేడు అనే అక్కసుతో మీ అంతర కుట్ర అంతరంగ ఉన్న మీ ఓరువ లేనితనం బయల్పడింది ఇక కాస్కో మిస్టర్ అమిత్ షా జి ఈ దేశ ప్రజలకు మీరేంటో మీ వెనకాల ఉన్న మీ సంఘ పరివార్ ఏంటో భారత రాజ్యాంగం పట్ల అది నిర్మించిన బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల మీ కుట్ర బయటపడింది వెంటనే మీ వ్యాఖ్యలని వెనక్కి తీసుకొని దేశ ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి లేదంటే ఏ భారత రాజ్యాంగం ద్వారా నైతే మీరు కూర్చున్న కుర్చీ ఉందో వెంటనే ఖాళీ చేసి రాజీనామా చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాము. భవిష్యత్తులో మీ కుట్ర ని దేశ ప్రజలందరికీ తెలియజేసి మిమ్మల్ని తీసేసే పరిస్థితి రాబోతా ఉంది. అదేవిధంగా నాటినుండి నేటి వరకి మీ అగ్రవర్ణ రాజకీయ పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ పార్టీ, సోషలిస్టు, కమ్యూనిస్టుల పేరుతో మరియు ఇతర అగ్రవర్ణ సమాజా రాజకీయ పార్టీలన్నీ కూడా భారత రాజ్యాంగానికి అంబేద్కర్ కి అడుగడుగునా అడ్డుపడుతున్న శక్తులే కనుక ఈ దేశ అట్టడుగు వర్గాల ప్రజల బ్రతుకులు నేటికీ మారకుండా కుట్ర పన్నుతున్నారు. ఈ దేశ మెజారిటీ ప్రజలైన అట్టడుగు వర్గాల ప్రజల బ్రతుకులు మారాలంటే వందకి 100% భారత రాజ్యాంగాన్ని సంపూర్ణంగా అమలు చేయగల అట్టడుగు వర్గాల నాయకత్వమే ఈ దేశానికి శిరోధార్యం అని అన్నారు. సీనియర్ న్యాయవాది ఏ బాపురావు మాట్లాడుతూ బీజేపీ పాలనా మీ కుట్రలు ఇక చాలు మీరు నిరభ్యంతరంగా తప్పుకోవచ్చు లేదంటే మేమే తీసేటువంటి పరిస్థితులు కూడా తీసుకొస్తాము ప్రపంచంలోకెల్లా అతి గొప్ప రాజ్యాంగాన్ని నిర్మించిన బాబాసాహెబ్ అంబేద్కర్ మీ అవమానించడం అంటే ఈ దేశ అట్టడుగు వర్గాల ప్రజలందరినీ అవమానించి నట్టేనని అందుకు వెంటనే అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పి. యాదగిరి, జె. యాదగిరి ప్రకాష్, ప్రసాద్, ప్రవీణ్, లావణ్య, అరుణ, లయ రాజ్ కుమార్, పర్వతం రాములు వెంకటేష్ శ్రీనివాస్ రాజేష్ వినయ్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now