బొమ్మెర శ్రీనివాస్ డిమాండ్
ప్రశ్న ఆయుధం న్యూస్ డిసెంబర్ 20 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మెర శ్రీనివాస్ కొత్తగూడెం సింగరేణి ఏరియా హాస్పిటల్ సెంటర్ నుండి గురువారం ప్రకటన విడుదల చేశారు.భారత దేశ హోం శాఖ మంత్రి అమిత్ షా పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ పై చేసిన కామెంట్ సరైనది కాదని భారత దేశ అణగారిన ప్రజల గుండె చప్పుడు అంబేద్కర్ నినాదం దాని వినిపించే శక్తుల గొంతు నొక్కడం అమిత్ షా చేసిన కామెంట్ అని శ్రీనివాస్ ఖండించారు.బిజెపి ప్రభుత్వంలో ఆది నాయకులు ప్రతి సందర్భంలో అంబేద్కర్ పై చేసే అనుచిత వాక్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అణగారిన ప్రజలు గమనిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.అమిత్ షా బేశరత్తుగా వ్యాఖ్యలను విరమించుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
అంబేద్కర్ పై అమిత్ షా కామెంట్ విరమించుకోవాలి
by Naddi Sai
Published On: December 20, 2024 10:04 pm