కార్తీక మాసంలో ఉసిరి భోజనాలు

*కార్తీక మాస ఉసిరి చెట్టు భోజనాలు*
*సాంప్రదాయాన్ని శాస్త్రాన్ని (సైన్సు) ముందుకు తీసుకెళుతున్న గ్రామస్తులు*

*ఇల్లందకుంట నవంబర్ 9 ప్రశ్న ఆయుధం::-*

కార్తీక మాసం అంటే కార్తీక దీపాలు..వనభోజనాలు గుర్తుకొస్తాయి. వనభోజనాలు అంటే ఉసిరి చెట్టే గుర్తుకొస్తుంది. కార్తీకమాసంలో ఉసిరిచెట్టు కింద కూర్చుని భోజనాలు చేయటం హిందూ సంప్రదాయంలో ఆచారంగా వస్తోంది. హిందు పండుగలకు ఆరోగ్య రహస్యాలకు నిలయం అనే విషయం ప్రతీ పండుగలోను కనిపిస్తుంది. ఆరోగ్యాలను ఆచారాలుగా మార్చిన ఘనత మన పూర్వీకులది. సైన్స్ ను నమ్మినట్లుగా చాలామంది శాస్త్రాన్ని నమ్మరు. అదో మూఢత్వమని..వట్టి మూఢనమ్మాకాలని కొట్టిపారేస్తుంటారు. కానీ సైన్స్ నే శాస్త్రంగా..దాన్ని భక్తిగా నమ్మించి అనుసరించేలా చేయటం మన భారత దేశ మన పూర్వీకుల గొప్పతనం అని చెప్పి తీరాలి దీంట్లో భాగంగా కార్తీక మాసంలో పూజలు,స్నానాలు, దీపాలు, ఉసిరి చెట్టుకింద భోజనాలు వంటి సంప్రదాయంగా మార్చారు శనివారం రోజున ఇల్లందకుంట మండల కేంద్రంలోని కంకణాల రవీందర్ రెడ్డి ఇంటి ఆవరణలో గల ఉసిరి చెట్టు కింద భోజనాలు ఏర్పాటు చేసి ఇంటి పొరుగు వారిని బీఎస్సీ అగ్రికల్చర్ చేస్తున్న విద్యార్థులను పాల్గొనే విధంగా ఏర్పాటు చేశారు మన పూర్వీకుల యొక్క ఆచార్య వ్యవహారాలను ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను ఆరోగ్య విషయాలను ముందుకు తీసుకెళ్లాలని ఉసిరి భోజన సమయంలో పాల్గొన్న మహిళ మణులు అభిప్రాయపడ్డారు మహిళలు ఉసిరి యొక్క ప్రత్యేకతను తెలుపుతూ అసలు ఈ భూమ్మీద ఎన్నో చెట్లు ఉండగా కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకిందే భోజనాలు చేయాలనే సంప్రదాయం రావడానికి కారణం కార్తీకమాసంలో శ్రీ మహావిష్ణువు, లక్ష్మీ దేవి ఇద్దరూ కొలువై ఉంటారన్నదని విష్ణుపురాణ కథనం అని ఉసిరిని భూమాతగా కూడా కొలుస్తారని దేవదానవ సంగ్రామంలో కొన్ని అమృత బిందువులు పొరపాటున భూమ్మీద పడటంతో పుట్టిందే ఉసిరి అని తెలిపారు ఉసిరిలో ఉండే అద్భుతమైన ఔషధ గుణాలు వృద్దాప్యాన్ని దరిచేరనివ్వవని ఆయుర్వేద నిపుణులు చెబుతారని అద్భుతమైన ఔషదాల గని ఉసిరి. ఉసిరి చెట్టు గాలి కూడా ఆరోగ్యానికి మంచిదని అటువంటి ఉసిరి చెట్టుని ధాత్రీ వృక్షమని ఉసిరి ఆరోగ్యానికి సంజీవినిలాంటిది పేర్కొన్నారు ఉసిరి భోజనం కార్యక్రమంలో ఎక్స్ ఎం పి టి సి రవీందర్ రెడ్డి గణపతి రెడ్డి మల్లారెడ్డి దేవేందర్ రెడ్డి ప్రభాకర్ రాజిరెడ్డి మహిళలు విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now