అమ్మవారి కరుణాకటాక్షాలు అందరి పై ఉండాలి
– ప్రజ్ఞాపూర్ లో వెల్లివిరిసిన ఆధ్యాత్మికం
– త్రిశక్తి ఆలయ ప్రాంగణంలో భక్తులు సందడి
– బీజేపీ సీనియర్ నాయకుడు దారం గురువా రెడ్డి
గజ్వేల్, 08 మార్చి 2025 : అమ్మ దయ ఉంటే అంత మంచే జరుగుతుందని బీజేపీ సీనియర్ నాయకుడు దారం గురువా రెడ్డి అన్నారు. శనివారం నాడు సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని త్రిశక్తి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ సీనియర్ నాయకుడు దారం గురువారెడ్డి. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గురువారెడ్డికి చిరు సన్మానం చేసి జ్ఞాపిక అందజేశారు. అనంతరం దారం గురవారెడ్డి మాట్లాడుతూ శక్తి స్వరూపిణి అమ్మ దయ ఉంటే అంతా మంచి జరుగుతుందని ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో శ్రీ మహంకాళి మాత శ్రీ పెద్దమ్మ తల్లి శ్రీ నల్ల పోచమ్మ తల్లి దేవతమూర్తుల ఆలయ నిర్మాణం, దేవతామూర్తుల ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమం నిర్వహించిన నిర్వాహకులను అభినందిస్తూ, అమ్మవారి కరుణాకటాక్షాలు అందరి పై ఉండాలని అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున శక్తి స్వరూపిణి అమ్మవార్లను దర్శించుకోవడం సంతోషంగా ఉందని అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, నాయకులు కుడిక్యాల రాములు, రామరాజు, నాగేందర్ రెడ్డి, భక్తులు తదితరులు పాల్గొన్నారు.