Site icon PRASHNA AYUDHAM

ఉభయకుశలోపరి..

ఉభయకుశలోపరి..!

అతివినయ..వీరవిధేయుడైన నేను వ్రాయు

లేఖార్ధములు..!

ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘోరపరాభవము..పరాజయము సంభవించిన తరువాత మీ నుండి ఒక్క ఓదార్పు లభించలేదు..!

ఇంత లోనే అంత చేదు అయ్యానా..!?

ఇరువురము అధికారము వెలగబెట్టినపుడు మీరు చూపిన ప్రేమ అభిమానము ఇప్పుడు మచ్చుకు కూడా కానరావటం లేదు..!

 

కలకాలము ఇలాగే అధికారములో ఉందాము

మనకు తిరుగులేదు అని మీరు ఎప్పటికప్పుడు వెన్ను తట్టి ప్రోత్సహించిన సంగతి మీరు మరచిపోయారేమో కాని నేను మరువజాలకున్నాను.

 

ఓటమి తర్వాత అధికారం అంతమైనప్పుడు హితులు సన్నిహితులు..బంధుగణం నా తోడు దొంగలు అందరూ మొఖం చాటేస్తున్నారు.

ఒక్కొక్కరు నన్ను విడిచి వెళుతున్నారు.

ఆ పైవాళ్ళు ఎన్నికల వరకు దూరంగా ఉంటాము తరువాత మన యవ్వారం మామూలే అని మాటిచ్చి కూడా..మాట తప్పారు.

వారికి అనివార్య పరిస్ధితులు దాపురించాయి.

 

చంద్రబాబు ప్రతీకారం తీర్చుకుంటాడేమో అనుకున్నాను.

లోకేష్ రెడ్ బుక్..ధిక్ రెడ్ బుక్ గా కలలో కనిపించి ఉలిక్కిపడ్డాను.

కాని వాళ్ళు ఆదిశగా కార్యాచరణ కనిపించలేదు.

అయినా నేను ఢిల్లీ వెళ్ళి లొల్లి చేసాను.

పైకి చూడటానికి కక్ష సాధింపు కనబడటం లేదు కాని..!

ఒక్కొక్కటి బయటకు తీస్తున్నారు.

నేను ఇన్ని అరాచకాలు చేసానా అని నేను కూడా ఆశ్చర్యపోయే విధం గా రకరకాల కధనాలు బయటకు వస్తున్నాయి.

మన పేటీయమ్ బేచ్ మళ్ళీ మొదలెట్టారు..కాని గుబులు గా ఉన్నది.

 

బొంబాయి డాక్టరు మరియు యాక్టరు జత్వానీ కేసు ఇంత సీరియస్ అవుతదని అనుకోలేదు.

ఏకంగా ముగ్గురు ఐపీయస్ లు ఎల్లమ్మకోటకు వెళ్ళిపోయారు.

ఏదో మా ఊళ్ళో చేసిన ముఠా పంచాయితీ లెక్క చేయించాను.

అది రివర్సై నన్ను మెట్ట తిట్లు తిడుతున్నారు అధికార్లు..!

తిట్టడంతో సరిపెట్టకుండా అంతా మీరే చేసారని నా వంక బొమ్మరిల్లు సినిమా లో లాగ నా వంక చూస్తున్నారు.

 

నందిగం సురేష్..టీడీపి ఆఫీసు ధ్వంసం కేసులు షురూ అయ్యాయి.

ఇంకా కొన్ని లైనులో ఉన్నాయి.

రఘురామకృష్ణం రాజు గారి కేసు..అబ్బ సాయిరామ్!

తలుచుకుంటే కాళ్ళలో ఒణుకు వస్తుంది.

అవాళ నేను ఎత్తుకొచ్చాను..మీరు సహకరించారు.

ఇప్పుడు నొప్పి తెలుస్తుంది.

మెల్లమెల్లగా మా అంతఃపురానికి వచ్చేసేలా ఉన్నది.

 

ఇప్పుడు తిరుమల లడ్డూ విషయం..!

నిజమే చాలా అపచారం జరిగింది.

ఒళ్ళు కొవ్వెక్కి..అధికార మదం తో ప్రవర్తించాము.

నోటికొచ్చినట్టు మాట్లాడించాను.

నన్ను అడ్డం పెట్టుకుని మా చిన్నాన్న సుబ్బారెడ్డి..రోజారెడ్డి..కరుణాకర రెడ్డి..చెవిరెడ్డి..పెద్దిరెడ్డి..నన్ను మించి దోపిడీ చేసారు.

చాలా మంది చెప్పారు..వెంకన్నతో పెట్టుకోవద్దని..కళ్ళు మూసుకుపోయాయి అప్పుడు.

ఇప్పుడు ఏమి మాట్లాడాలో తెలియటం లేదు.

చంద్రబాబు సమయం చూసి మడత పెట్టేసాడు.

అసలే ఆయన శ్రీవారి భక్తుడు..!

ఇక నన్ను వదిలేలా లేడు..!

 

అన్నిటికీ మించి ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే..!?

నేను తుక్కు తుక్కుగా..చిత్తు చిత్తు గా ఓడిపోయినా..!

జనం నన్ను చీదరించుకుని..ఖాండ్రించి ఉమ్మినా ధైర్యంగా సిగ్గులేకుండా బయటకు రాగలను.

నా ధైర్యం..మీరు..ఆ పైనున్న మన దోస్తులు..!

ఇప్పుడు తిరుమల లడ్డూ విషయం బయటకు వచ్చిన తరువాత..!

మీరు కాని ఆ పైనున్న వారు కాని నా వంక కన్నెత్తి చూసి మాట్లాడే సాహసం చెయ్యరని అర్ధం అవుతున్నది.

నా ఫోన్ నెంబరు బ్లాక్ చేసినట్టున్నారు.

మీకు ఢిల్లీకి ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఉలుకు పలుకు లేదు.

అప్పుడే అంత అంటరాని వాడిని అయ్యానా..!

చేసిన బాసలు..చెప్పుకున్న ఊసులు మరచిపోయారా..!?

 

దేశం విడిచి వెళ్ళనిచ్చేలా లేరు..!

చాలా మంది హితులు ఇదివరకు చెప్పారు..చంద్రబాబు సమయం చూసి తొక్కేస్తాడు..జాగ్రత్త..!

నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు తగదు అని.

నా చెవి కెక్కలేదు.

అప్పుడు మీరూ పైనున్న వారే ఆదర్శం..!

మీ మాటలే శిరోధార్యం..!

కాని కాలం కాటేసింది.

మీరు షెడ్ కెళ్ళిపోయారు..!

మీ తుంటి ఎముక విరిగి బాధపడుతున్నారు..!

ఆ పైవాళ్ళకి ఇప్పుడు చంద్రబాబు ఆపధ్భాంధవుడయ్యాడు.

 

మీరు నాతో మాట్లాడటానికి బయపడుతున్నారని తెలుస్తుంది.

గోడకు చెవులుంటాయని మీకు బాగా తెలుసు కదా..!

పుండు మీద కారం చల్లినట్టు..మీ అబ్బాయి మీ మేనల్లుడు చంద్రబాబు మూడు నెలల పాలన బాగుందంటున్నారు.

 

నా గతి ఈ రీతిన మారుతుందని అసలు ఊహించలేదు.

నా ప్రియమైన చెల్లెళ్ళు రంపపు కోత కోస్తున్నారు.

సామాజిక మాధ్యమాలు నన్ను కామెడీపీసుగా మార్చేసాయి.

 

అన్నట్టు అర్ధరాత్రి తర్వాత మా నాన్న ఇదివరకు మాట్లాడేవాడు.

మా చిన్నాన్న పైకి వెళ్ళిన కాడ్నించి ఆయన అసలు ఇటువైపే చూడటం లేదు.

ఆయన కోసం చూస్తుంటే..!

డ్రైవరు సుబ్రహ్మణ్యం..డాక్టరు సుధాకరు వచ్చి వెళుతున్నారు.

చేతులు పిసుక్కుంటూ పిచ్చి చూపులు వెర్రి నవ్వులతో కాలం గడుపుతున్నాను.

 

మీరు ఎలాగూ ఫోనులో అందుబాటులో ఉండటం లేదు.

నా గోడు ఈ లేఖ రూపంలో వెళ్ళబోసుకుంటున్నాను.    ఇట్లు 

మీరు వదిలేసినా

మీ పట్ల ఏమాత్రం కోపం రాని మీ అభిమాన అతివినయ వీర విధేయుడు..!

ఊడగొట్టిన మంచం కోడు..!

అడుసుమిల్లి శ్రీనివాసరావు

Exit mobile version