Site icon PRASHNA AYUDHAM

అమ్రాబాద్ మండలంలో జరుగుతున్న సమగ్ర కుటుంబ సర్వేను పరిశీలించిన ఎంపీడీవో.

కుటుంబ
Headlines in Telugu
  1. అమ్రాబాద్ మండలంలో 80% పూర్తి అయిన కులగణన సర్వే పరిశీలన
  2. ఎంపీడీవో అమ్రాబాద్ గ్రామాల్లో సమగ్ర కుటుంబ సర్వే పనితీరును పరిశీలించారు
  3. ట్రైబల్, రూరల్ గ్రామాల్లో కులగణన సర్వే కొనసాగింపు
  4. సర్వే పూర్తి చేయడానికి ప్రజలకు, ప్రతినిధులకు సూచన
  5. అమ్రాబాద్ మండలంలో 35 సిస్టమ్‌ల ద్వారా ఆన్లైన్ డేటా ఎంట్రీ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగనన సర్వేలో భాగంగా గురువారం అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలంలో జరుగుతున్న సమగ్ర కుటుంబ సర్వే పనితీరును మండల ఎంపీడీవో పరిశీలించారు. ముఖ్యంగా అమ్రాబాద్,, మాచారం, వెంకటేశ్వర్ల బావి జంగం రెడ్డిపల్లి, గ్రామాలను సందర్శించి ఇప్పటివరకు సుమారుగా 80 శాతం పూర్తి అయినట్టు తెలిపారు.

మండలంలో మొత్తం ఇండ్ల సంఖ్య 10768 అందుకుగాను 8125 పూర్తి కాబడినవి 24వ తేదీ వరకు సర్వే కొనసాగించబడుతుందని, కాబట్టి గ్రామంలో అందుబాటు లేనటువంటి వారు ఈ రెండు మూడు రోజులలో తమ గృహములకు వచ్చిన ఎన్యుమరేటర్లు సహకరించి సర్వే పూర్తి చేయుటకు ప్రజలు, ప్రజాప్రతినిధులు, సహకరించవలసిందిగా కోరారు.ఇట్టి సర్వే ప్రక్రియకు ఆన్లైన్ చేయడానికి డాటా ఎంట్రీ ఆపరేటర్లలో 70 మందిని ఎంపిక చేసి నాలుగు ప్రదేశాలలో ఆన్లైన్ ఎంట్రీ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని, ముఖ్యంగా మండల పరిషత్ కార్యాలయంలో 10,ఐటిఐ మన్ననూర్ లో 10, ఏకలవ్య ఇన్స్టిట్యూట్ పదరా లో 10, డిఎల్పిఓ ఆఫీస్ అచ్చంపేట ఐదు, మొత్తం 35 సిస్టంల ద్వారా రెండు షిఫ్టుల ప్రకారము ఆన్లైన్ టాటా అంటే చేయబడుతుందని తెలిపారు.

Exit mobile version