నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్సు అందజేత

మెదక్/నర్సాపూర్, మార్చి 24 (ప్రశ్న ఆయుధం న్యూస్): మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు జన్మదినాన్ని పురస్కరించుకుని పార్లమెంట్ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రులకు అంబులెన్సులను విరాళంగా అందజేశారు. సోమవారం నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి ఎంపీ రఘునందన్ రావు ఆదేశాల మేరకు మెదక్ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో అంబులెన్స్‌ను ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ పావనికి అందజేశారు. ఈ సందర్భంగా మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ.. అత్యవసర వైద్య సేవలందించడంలో అంబులెన్స్‌లు కీలక పాత్ర పోషిస్తాయని, పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ఈ అంబులెన్స్ ఉపయోగపడాలని అన్నారు. ప్రజల ఆరోగ్య భద్రత కోసం ఎంపీ రఘునందన్ రావు ఈ సందర్భంగా ఆసుపత్రులకు అంబులెన్సులను అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు రమేష్ గౌడ్, సంగసాని సురేష్, మండల అధ్యక్షుడు చంద్రియా, నగేష్, నాగప్రభూ, పెదపులి రవి, దాసు, బీజేపీ నర్సాపూర్ అసెంబ్లి నాయకులు భాదే బాలరాజ్, సంగసాని రాజు, దిగంబర్, సంగమేష్, రాములు నాయక్, సదానందం, ఆంజనేయులు గౌడ్, ఆంజనేయులు, భిక్షపతి, వాల్దాస్ అరవింద్ గౌడ్, ఉదయగౌడ్, మహేందరగౌడ్, నగేష్ గౌడ్, శ్రీకాంతచారీ, చారి, శ్రీకాంత్, ప్రేమ్ కుమార్, పూర్ణచందర్, స్వామి, శేఖర్, వివిధ మండలాల నాయకులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now