క్షమాపణలు చెప్పిన దిల్ రాజు
నిజామాబాద్ జిల్లా జనవరి 11
తెలంగాణ ప్రజలకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు క్షమాపణలు చెప్పారు. ఇటీవల నిజామాబాద్‌లో జరిగిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆయన వ్యాఖ్యలపై తీవ్ర నిరసనలు వ్యక్తమైన విషయం తెలిసిందే. తెలంగాణలో కల్లు, మాంసానికి వైబ్ ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై వివిధ వర్గాల నుంచి వ్యతిరేకత రావడంతో ఆయన స్పందించారు. జిల్లావాసిగా నిజామాబాద్‌లో ఈవెంట్ చేశానని.. మన సంస్కృతిలో ఉండే దావత్ గురించి మాత్రమే చెప్పానని ఆయన తెలిపారు. కాగా.. ఇదే ఈవెంట్లో యాంకర్ శ్రీముఖి రామలక్ష్మణుల గురించి చేసిన వ్యాఖ్యలపై కూడా నిరసన వ్యక్తమైన విషయం తెలిసిందే. దీనిపై ఆమె కూడా హిందూ సమాజానికి క్షమాపణ తెలిపారు.