మరణించిన సమగ్ర శిక్ష ఉద్యోగినికి ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి

మరణించిన సమగ్ర శిక్ష ఉద్యోగినికి ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి

– జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ

కామారెడ్డి

శనివారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని కేజీబీవీ వలిగొండ ప్రధానవంట మనిషి మల్లమ్మ మరణం పట్ల తీవ్ర బ్రాంతిని వ్యక్తం చేస్తూ ప్రభుత్వం వెంటనే ఎక్స్ గ్రేషియా ప్రకటించి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించి ఆ కుటుంబానికి భరోసానివ్వాలని జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30-12-2024 రోజున 30 కిలోల అన్నం వండిన గిన్నె పొయ్యినుండి కిందకు దించే సమయంలో జారి కడుపుకి కాలడం జరిగిందన్నారు. బాగా కాలడం వలన ఇన్ఫెక్షన్ సోకిన కారణంగా హైదరాబాదులో హాస్పిటల్ లో ఎమర్జెన్సీ సర్జరీ చేస్తుండగా హార్ట్ స్ట్రోక్ తో కోమా లోకి వెళ్లి శనివారం అంతిమ శ్వాస విడిచారు. సమగ్ర శిక్ష ఉద్యోగులు నెల రోజుల సమ్మె చేసిన సమయంలో ఇద్దరు మరణించిన వారికి ఎక్స్ గ్రెషియా చెల్లిస్తామని ప్రభుత్వం, అధికారులు హామీ ఇచ్చినారన్నారు.

కావున వెంటనే పది లక్షలు ఎక్స్ గ్రేషియా విడుదల చెయ్యాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment