2 వ రోజు కొనసాగిన నిరవధిక సమ్మె
– ఎమ్మెల్యేకు వినతి పత్రం
ప్రశ్న ఆయుధం – కామారెడ్డి
తెలంగాణ విశ్వవిద్యాలయం దక్షిణ ప్రాంగణంలో పార్ట్ టైం అధ్యాపకులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి కి వినతి పత్రం అందించారు. మీ న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని ఎమ్మెల్యే అన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యూనివర్సిటీల జాయింట్ సెక్రెటరీ డా. ఇంద్రకరణ్ రెడ్డి, డా. కనకయ్య, డా. శ్రీను కేతవాత్, డా. రమేష్, డా.శ్రీకాంత్ గౌడ్, డా. పోతన, డా.వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.