రోడ్డు ప్రమాదంలో మతిస్థిమితం లేని మహిళ మృతి

ప్రశ్న ఆయుధం న్యూస్ జనవరి 7 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)

మెదక్ జిల్లా శివ్వంపేట మండలం చండి గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మతిస్థిమితం లేని మహిళ మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. చండి గ్రామ శివారులో సుమారు 45 ఏళ్ల వయసు గల మతిస్థిమితం లేని మహిళ కొంతకాలంగా తిరుగుతున్నట్లు తెలిపారు. ఈరోజు తూప్రాన్ – నర్సాపూర్ రోడ్డుపై జేఎస్ఆర్ ఫంక్షన్ హాల్ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు చండి పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు

Join WhatsApp

Join Now