అంతర్ జిల్లా దొంగ అరెస్ట్ లక్ష నలభై మూడు వేల సొత్తు స్వాధీనం..
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవుని పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 17న మధ్యాహ్నం గోష్కి రాజయ్య కాలనీలో నివాసం ఉంటున్న రిటైర్డ్ ఆర్టిసి ఉద్యోగి ఇంజమూరి రాములు ఇంట్లో దొంగతనం జరుగగా బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు దేవునిపల్లి ఎస్సై రాజు తెలిపారు. మంగళవారం నరసన్నపల్లి శివారులో వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమాన స్పదంగా కనిపించిన వ్యక్తిని పట్టుకొని విచారించగా కామారెడ్డి పిఎస్ పరిధిలో బైక్ దొంగతనము దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘోష్కి రాజయ్య కాలనీలో పగలు మెయిన్ డోర్ పగలగొట్టి చోరీకి పాల్పడినట్లు నిందితుడు హైదరాబాదులోని టోలిచౌక్ కు చెందిన మీరు ఖాజీం అలీ ఖాన్ కాజు అలియాస్ సూర్య భాయ్ నీ అరెస్టు చేసి అతని వద్ద నుంచి మూడున్నర తులాల బంగార గొలుసు 1.2 తులాల బంగారు గొలుసును ఒకటి ఆకుపచ్చ రాయి ఉన్న ఉంగరం మూడు ఉంగరాలు ఒకటి పాయింట్ రెండు గ్రాముల బంగారం బైక్ ఏపీ 25 కే 9842 మొత్తం లక్ష43 వేల విలువగల సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో సంగారెడ్డి జిల్లాలో పరిధిలోని అన్ని కలిపి ఒక వంద రెండు కేసులు నమోదైనట్లు తెలిపారు. ఫస్ట్ క్లాస్ నిందితుని హాజరు పరిచి రిమాండ్ కు తరలించినట్లు ఎస్ఐ రాజు తెలిపారు. ఈ కేసును చేదించిన దేవునిపల్లి ఎస్ఐ రాజు ఎస్సై 2 మసూదన్ రెడ్డి క్రైమ్ కానిస్టేబుల్ రామస్వామి బాలకృష్ణ హోమ్ గార్డ్ రాజు టెక్నికల్ సిబ్బంది రోహిత్ శ్రీను లకు కామారెడ్డి డి.ఎస్.పి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు.