పలుచోట్లా విజ్రుంభించిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా
కొడిమ్యాల, 12 జనవరి 2025 : జగిత్యాల పట్టణంలోని నాలుగు షాపుల్లోనూ, కొడిమ్యాల పుడూరులోనూ అంతర్రాష్ట్ర షట్టర్ లిఫ్టింగ్ దొంగల ముఠా దొంగతనాలకు పాల్పడింది.అదే ముఠా కరీంనగర్ కమిషనరేట్ లోని గంగాధర మండలంలో కూడా దొంగతనాలు చేసింది.జగిత్యాల పట్టణంలో నాలుగు షెటర్లలో లిఫ్ట్ చేసి దొంగతనం చేసారు.కొడిమ్యాల మండలంలోని పూడూరు గ్రామంలోని నంది వెంకటేష్ యొక్క కిరాణం షాపులో రాత్రి అందాజా రెండు గంటల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు షెటర్ లిఫ్ట్ చేసి కౌంటర్లో ఉన్న 3000 రూపాయలను దొంగలించినారు ఇట్టి విషయంపై కొడిమ్యల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టడం జరిగింది.ప్రజలందరూ ఈ పండుగ సమయంలో ఎవరైనా ఇంటికి తాళం వేసి ఊర్లకు వెళ్లినచో వారి వెంటనే విలువైన వస్తువులు తీసుకొని వెళ్లాలి. ఎవరైనా అనుమానుతులు కనిపించడం వెంటనే 100.కి కాల్ చేయాలని కొడిమ్యాల ఎస్సై సందీప్ కుమార్ తెలిపారు.