Site icon PRASHNA AYUDHAM

అన్న క్యాంటీన్”లను దత్తతు తీసుకునే దాతలకు బహిరంగ గా ఆహ్వానం

 

అన్న క్యాంటీన్”లను దత్తతు తీసుకునే దాతలకు బహిరంగ గా ఆహ్వాన పలకండి. దానిద్వారా ఇంకా ఎక్కువ అన్న క్యాంటీన్ లు నిర్వహించవచ్చు. పేద వారి ఆకలి తీర్చే అవకాశం ఉంటుంది… ప్రభుత్వం పై భారం తగ్గుతుంది..దాతలు వారి వారి ప్రాంతం లో కాంటీన్ దత్తతు తీసుకుంటే.. దత్తత తీసుకున్న దాత పేరు పెట్టే అవకాశం ఇస్తే ఎక్కువ మంది ముందుకు వచ్చే అవకాశం.ఉదాహరణ : సుబ్బారావు అనే వ్యక్తి ఒక ‘అన్న క్యాంటీన్’ దత్తత చేసుకుంటే దానికి.. “ సుబ్బారావు గారి ‘అన్నక్యాంటీన్’ అని పేరు పెట్టే అవకాశం కల్పించాలి. దానివలన “అన్న క్యాంటీన్ “ అనే బ్రాండ్ పేరుకి ఏ విధమైన ఇబ్బంది ఉండదు..ప్రభుత్వం పై భారం తగ్గుతుంది..విరాళం ఇచ్చిన వారికీ గౌరవం కూడ దక్కుతుంది.  అలాగే ఒక్కరోజు అన్నధానం కొరకు విరాళాలకు కూడా అవకాశం కల్పించాలి. *ప్రతి అన్న క్యాంటీన్ దగ్గర ఓ Display Board పెట్టి.. ఆరోజు దాతల పేర్లు ప్రదర్శిస్తే.. వారి వారి స్థాయిని బట్టి ఇంకా ఎక్కువ మంది ఉత్సాహం చూపే అవకాశం ఉంది…*సమాజంలో చాలా మందికి దానగుణం ఉంది. ఎలా చెయ్యాలో, ఎవరికి చెయ్యాలో, ఎవరి ద్వారా చేయాలో తెలియదు..

Exit mobile version