దివ్యాంగులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి

స్మిత సబర్వాల్ పై చర్యలు తీసుకోవాలి
బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్

ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి రాయల పోలయ్య జూలై 24

దివ్యాంగులపట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన స్మిత సబర్వాల్ పై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని,స్మిత సబర్వాల్ దివ్యాంగులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ యెర్రా కామేష్ డిమాండ్ చేశారు.బుధవారం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒక భాధ్యత గల ఐఏఎస్ అధికారి అయివుండి దివ్యాంగుల గురించి మాట్లాడింది పూర్తిగా మానవత్వానికే విరుద్ధమన్నారు.ప్రజల పన్నులతో జీతాలు తీసుకునే ప్రభుత్వ అధికారి ఈవిధంగా మాట్లాడటం సరైంది కాదన్నారు.సివిల్ సర్వెంట్ అధికారులంటే వారికి ప్రజల పట్ల ప్రేమ,దయ,కరుణ,సానుభూతి ఉండాలి.సమాజంలో ఏదో అవయవ లోపం వల్ల పుట్టిన దివ్యాంగులకు యూపీఎస్సీ పరీక్షలకు కావాల్సింది మెదడు అని తెలియదా అని ప్రశ్నించారు?.. స్మిత సబర్వాల్ వ్యాఖ్యలు మానవత్వానికే మచ్చ అని ఆమె తక్షణమే క్షమాపణ చెప్పకపోతే ఆమెను మానసిక వికలాంగురాలనే అనుకోవాల్సి వస్తుందన్నారు.రాజ్యాంగాన్ని కాపాడాల్సిన ఓ అధికారి దివ్యాంగులను కించపరచడం సరికాదని ఇటువంటి వ్యక్తి ఐఏఎస్ ఉద్యోగానికి పనికిరాదని యూపీఎస్సీ ఈమెపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ఆమెకు ఇచ్చిన పోస్టులన్ని తీసేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈకార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గంధం మల్లికార్జున రావు,మాలోత్ వీరు నాయక్,వంగా రవిశంకర్,తాటిపాముల హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now