ప్రశ్న ఆయుధం న్యూస్ సెప్టెంబర్ 5 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గోమారం గ్రామం లో గుర్తు తెలియని మగ వ్యక్తి మృతదేహం లభ్యమయ్యింది వివరాల్లోకి వెళితే శివ్వంపేట మండలం గోమారం గ్రామంలో గుర్తుతెలియని మగ వ్యక్తి వయస్సు (35-40) గల వ్యక్తి గోమారం గ్రామ పంచాయతీ వెళ్లే రోడ్డు పక్కన మరణించి కనిపించాడని పోలీసులకు తెలిపారు గ్రామస్తులని విచారించగ అతడు ఎవరో తేలిదని గత మూడు నాగులు రోజుల నుండి గోమారం గ్రామం లో కనిపిస్తున్నడని చెప్పారు గోమారం గ్రామ పంచాయతీ సెక్రెటరీ మన్నే కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు ఆచూకీ తెలిసినవారు శివ్వంపేట పోలీస్ స్టేషన్ లో వివరాలు తెలపాలని ఎస్సై తెలిపారు