కరీంనగర్: ఫుట్‌పాత్‌పై గుర్తుతెలియని వృద్ధుడు మృతి
Mar 02, 2025,
కరీంనగర్: ఫుట్‌పాత్‌పై గుర్తుతెలియని వృద్ధుడు మృతి
కరీంనగర్ మాతా శిశు ఆసుపత్రి ముందు ఫుట్‌పాత్‌పై గుర్తుతెలియని ఓ వృద్ధుడు మృతి చెందాడని కరీంనగర్ టూ టౌన్ పోలీసులు తెలిపారు. కొన్ని రోజులుగా ఫుట్‌పాత్‌పైనే ఉంటున్న వృద్ధుడు, అనారోగ్యంతో మృతి చెందినట్లు పేర్కొన్నారు. మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచినట్లు శనివారం పోలీసులు తెలిపారు. వృద్ధుడిని ఎవరైనా గుర్తుపడితే కరీంనగర్ టూ టౌన్ పోలీసులకు సమాచారం అందించాలని పేర్కొన్నారు.