గుర్తు తెలియని వ్యక్తి శవం లభ్యం
కామారెడ్డి జిల్లా బిబిపేట్
(ప్రశ్న ఆయుధం)జూన్ 28
కామారెడ్డి జిల్లా బీబీపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని తుజల్పూర్ గ్రామం నుంచి ఆకారం గ్రామానికి వెళ్ళు దారిలో అనగా తుజల్పూర్ గ్రామ శివారులో కూడవేల్లి బ్రిడ్జి కింద నీటి గుంతలో ఒక గుర్తు తెలియని మగ మనిషి మృతదేహం కలదు అట్టి వ్యక్తి వయస్సు అందాద 30 నుంచి 35 సంవత్సరాల వయస్సు ఉండును, మరియు బ్లూ కలర్ జీన్స్ ప్యాంట్ బ్లాక్ కలర్ షర్ట్ కలదు. చెవులకు పోగులు కలవు. రెండు చేతుల మట్టలపైన టాటూ లు కలవు, ఎడమ చేతిపై త్రిశూలం గుర్తు కలదు, ఎడమ చేతి పైన సతీష్ అనే పేరు కలదు, కుడి చేతి పైన ప్రభాస్ అనే టాటూ కలదు, కుడి భుజం పైన నుండి ముందు ఛాతీ భాగం వరకు పాముల యొక్క టాటూలు కలవు, కుడి వైపున చెవి కింది భాగాన మెడ పైన ఐ లవ్ యు మామ్ అని టాటూ కలదు. సంఘటన స్థలానికి బీబీపేట్ ఎస్ ఐ ప్రభాకర్ చేరుకొని శవాన్ని బయటకు తీయించి పంచనామా చేసి పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించడం జరిగింది.