గాంధారి చద్మల్ రోడ్డుపై గుర్తు తెలియని వ్యక్తి హత్య – పెట్రోల్ పోసి కాల్చివేత..!

🔹గాంధారి చద్మల్ రోడ్డుపై గుర్తు తెలియని వ్యక్తి హత్య – పెట్రోల్ పోసి కాల్చివేత!🔹

కామారెడ్డి జిల్లా, అక్టోబర్ 16 (ప్రశ్న ఆయుధం):

గాంధారి మండలంలో దారుణ హత్య కలకలం రేపింది.

చద్మల్ రహదారి పక్కన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కాలిపోయిన స్థితిలో లభించింది.

గాంధారి–చద్మల్ రోడ్డుపై గుంతలో గుర్తు తెలియని మగవ్యక్తి శవం.

హంతకులు పెట్రోల్ పోసి కాల్చివేసినట్లు పోలీసులు అనుమానం.

మృతుడి వయసు సుమారు 30 సంవత్సరాలు, ఎత్తు 5.6 అడుగులు.

దుస్తులు: నీలి జీన్స్ ప్యాంటు, తెల్ల బనియన్, నలుపు గీతల చొక్కా.

ఎవరైనా గుర్తుపట్టిన వారు వెంటనే పోలీసులను సంప్రదించవలసిందిగా విజ్ఞప్తి.

గాంధారి మండల కేంద్రం నుండి చద్మల్ గ్రామానికి వెళ్లే దారిలో శివారు ప్రాంతంలోని రహదారి పక్కన ఈ భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తిని ఎవరో హతమార్చి, అనంతరం శవంపై పెట్రోల్ పోసి కాల్చివేసినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. శవం పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉండటంతో గుర్తింపు కష్టంగా మారింది.

మృతుడి వయసు దాదాపు 30 సంవత్సరాలుగా, ఎత్తు 5 అడుగులు 6 అంగుళాలు, నల్లని వర్ణం కలిగిన వ్యక్తిగా పోలీసులు వివరించారు. దుస్తుల ఆధారంగా గుర్తించే ప్రయత్నాలు సాగుతున్నాయి.

గాంధారి ఎస్సై ఆంజనేయులు మాట్లాడుతూ, “ఎవరైనా తమ బంధువు లేదా పరిచయస్తుడు మిస్ అయ్యినట్లయితే వెంటనే పోలీసులను సంప్రదించాలి” అని తెలిపారు.

📞 సంప్రదించవలసిన నంబర్లు:

ఎస్సై గాంధారి: 87126 86165

సీఐ సదాశివనగర్: 87126 86163

గాంధారి పోలీస్ స్టేషన్: 87126 66228

Join WhatsApp

Join Now

Leave a Comment