అపూర్వ సమ్మేళనo దాదాపు 15 సంవత్సరాల తర్వాత..
సిరిసినగండ్ల ఉన్నత పాఠశాలలోకొండపాక మండలంలోని సిరిసినగండ్ల ఉన్నత పాఠశాలలో 2008-09లో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. దాదాపు 15 సంవత్సరాల తర్వాత కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. నాడు పాఠశాలలో గడిపిన మధుర స్మృతులను, జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుని సంతోషంగా గడిపారు. ఒకరినొకరు ఆత్మీయంగా పలుకరించుకొని యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను శాలువా, మెమోంటోలతో సన్మానించారు.