ఉప్పల్ మినీ శిల్పారామంలో అలరించిన ఆంధ్ర నాట్య ప్రదర్శన,
మేడ్చల్ జిల్లా ప్రతినిధి / ఉప్పల్
జనవరి 11
ఉప్పల్ మినీ శిల్పారామం లో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శనివారం శ్రీ పేరిణి శ్రీనివాస్ శిష్య బృందం చే ఆంధ్రనాట్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. అలరిపు, వినాయక కౌతం, అగణిత, గంగాధర, నిను మించిన, నవగ్రహాలు, తిల్లాన భామాకలాపం, దశావతారాలు, నమోనాధ అంశాలను హిమగిరి, లాస్య, తేజశ్రీ, అదితి, వైష్ణవి, లక్ష్మి ప్రసన్న, తన్వి, బిందు ప్రియా, నేత్ర , శ్రీహిత, సహస్ర, సిరి మొదలైన వారు ప్రదర్శించి మెప్పించారు.