ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్ల విషయంలో కీలక నిర్ణయం

ర్హులైన వారికి మాత్రమే పింఛన్లు అందించాలనే ఉద్దేశంతో, కొత్త దరఖాస్తులను స్వీకరించే ప్రక్రియను ప్రారంభించడానికి సర్కార్ సిద్ధమవుతోంది. అనర్హులకు ఇప్పటి వరకు పింఛన్లు అందుతున్నట్లు వచ్చిన విమర్శలతో, ప్రభుత్వం అనర్హులను గుర్తించి, పింఛన్లను తొలగించే పనిని ప్రారంభించింది.వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత కార్మికులు వంటి వివిధ వర్గాలకు సిఫార్సు ఆధారంగా పింఛన్లు ఇచ్చారని, కొంతమంది అర్హత లేనప్పటికీ పొందుతున్నారని విమర్శలు వచ్చాయి. మరోవైపు, అర్హత ఉన్నా పింఛన్లు లభించకుండా కొందరి దరఖాస్తులు నిరాకరించారని ఆరోపణలు ఉన్నాయి.ఈ నేపథ్యంలో, సర్కార్ ప్రతి అర్హుడికి పింఛన్లు అందించాలన్న లక్ష్యంతో చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో పింఛన్ల విధివిధానాల రూపకల్పన కోసం ఐదుగురు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. పింఛన్ల తనిఖీ కోసం ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను రూపొందించాలని యోచిస్తోంది, దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల లబ్ధిదారులను సమీక్షించడం సులభమవుతుందిఇప్పటికే, వితంతువులు, ఒంటరి మహిళలు వంటి వర్గాల్లో అర్హులను గుర్తించేందుకు ప్రత్యేక విధానాలు రూపొందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు..

Join WhatsApp

Join Now