ఏపీలో లిక్కర్ స్కామ్ పై సిఐడి సోదాలు..

లిక్కర్
Headlines :
  • ఆంధ్రప్రదేశ్‌లో భారీ లిక్కర్ స్కామ్: సీఐడి 18 ప్రాంతాల్లో సోదాలు
  • మద్యం స్కామ్ పై సీఐడి దర్యాప్తు – కీలక రికార్డులు స్వాధీనం
  • గత ప్రభుత్వ హయాంలో భారీ కుంభకోణం ఆరోపణలు – సీఐడి దూకుడు

ఆంధ్రప్రదేశ్ డెస్క్
ప్రశ్న ఆయుధం నవంబర్ 01:

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ పై సిఐడి దూకుడు పెంచింది. బుధవారం సీఐడి ఏకంగా 18 ప్రాంతాల్లో సోదాలును నిర్వహించింది. కీలక రికార్డులను సీఐడిఅధికారులు స్వాధీనం చేసుకున్నారు.గత ప్రభుత్వ హయాంలో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపణలున్నాయి. మద్యం పాలసీలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం కుంభకోణం పై దర్యాప్తు చేయాలని సీఐడి కి అప్పగించింది.

Join WhatsApp

Join Now