Headline :
ఏపీలో రేపటి నుండి గుంతల రహిత రహదారి ప్రాజెక్ట్ ప్రారంభం – రూ.860 కోట్లతో జనవరి 15 నాటికి పూర్తి లక్ష్యం
ఏపీలో రేపటి నుంచి గుంతల రహిత రోడ్ల నిర్మాణానికి సంబంధించిన కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు నాయుడు విజయనగరం జిల్లాలోని గజపతినగరంలో ప్రారంభిస్తారు.
రూ.860 కోట్లతో జనవరి 15 నాటికి రాష్ట్రంలోని అన్ని రోడ్లను గుంతల రహితంగా మార్చాలని లక్ష్యంగా
పెట్టుకున్నారు. అన్ని జిల్లాలు, నియోజకవర్గాల్లోనూ రోడ్ల మరమ్మతుల పనులు ప్రారంభిస్తారు. ఇందులో అధునాతన విధానాలు అవలంభించేలా SRMయూనివర్సిటీ, ఐఐటీ తిరుపతితో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.