Headline:
ఏపీని వీడని వర్షాలు: ఆంధ్రప్రదేశ్‌లో రెండు రోజుల వర్ష సూచన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వర్షాలు వీడటం లేదు. నిత్యం రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. నేడు, రేపు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది.