పిల్లలకు తొలి గురువు అంగన్వాడీ కేంద్రాలు 

పిల్లలకు తొలి గురువు అంగన్వాడీ కేంద్రాలు

భువనగిరి మండల పరిధిలోని బండాసోమారం గ్రామంలో అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు . ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ కాటిక అనుజ రాణి మాట్లాడుతూ పసి పిల్లలకు తొలి గురువు అంగన్వాడీ కేంద్రాలే అని అన్నారు . పిల్లలకు ఇక్కడే వారి మొదటి విద్యాభ్యాసం మొదలవుతుందని అన్నారు . అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పిల్లల తల్లిదండ్రులు మీ యొక్క పిల్లలను అంగన్వాడీ లో చేర్పించాలని కోరారు . 5 సంవత్సరాల లోపు పిల్లలను అంగన్వాడీ కేంద్రంలో చేర్పిస్తే వారు కొంచెం పెద్దయ్యాక ప్రభుత్వ బడులకు పోవడానికి అలవాటు పడతారని అన్నారు . మా దగ్గర కూడా వాళ్ళకి చిన్న వయసులోనే క్రమశిక్షణ నేర్పిస్తామని మరియు ప్రభుత్వం అందించే అన్ని వసతులు కల్పిస్తామని తెలిపారు .

ఈ కార్యక్రమం లో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయ రాలు విజయ శ్రీ, గర్భిణీలు, బాలంతలు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now