అంగన్‌వాడీ చిన్నారులకు దుస్తుల పంపిణి

అంగన్‌వాడీ
Headlines
  1. కామారెడ్డిలో అంగన్వాడీ చిన్నారులకు ప్రత్యేక దుస్తుల పంపిణీ
  2. గడ్డం ఇందుప్రియ ఆధ్వర్యంలో అంగన్వాడీ పిల్లలకు ఉచిత దుస్తులు
  3. తెలంగాణ ప్రభుత్వ నూతన దుస్తులు అంగన్వాడీ విద్యార్థులకు అందజేత
  4. పొదుపు సంఘాల ద్వారా అంగన్వాడీ దుస్తుల తయారీ
  5. కామారెడ్డిలో మున్సిపల్ చైర్ పర్సన్ దాతృత్వ కార్యక్రమం
ప్రశ్న ఆయుధం న్యూస్, డిసెంబర్ 9, కామారెడ్డి :

కామారెడ్డి పట్టణంలోని కాకతీయ నగర్, రాజీవ్ నగర్ 14 వార్డ్ లో మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి అంగన్వాడీ చిన్నారులకు దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ విద్యార్థులకు నాలుగు వేర్వేరు రంగుల్లో దుస్తులను రూపొందించి, ఒక్కొక్కరికి రెండు జతల చొప్పున అందించనున్నారని అన్నారు. వీటి డిజైన్లను కూడా నిర్ధారించి ఇప్పటికే నమూనాలను అన్ని జిల్లాలకు పంపారని, ప్రస్తుతానికి జిల్లాల వారీగా వస్త్రాన్ని అందించేందుకు సిద్ధమయ్యారని తెలిపారు. అంగన్వాడి పిల్లలకు దుస్తులు కుట్టిన పొదుపు సంఘాల మహిళలకే వీటి బాధ్యతలను అప్పగించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఇంచార్జ్ సిడిపిఓ రోష్మ, సూపర్వైజర్ కవిత, అంగన్వాడి టీచర్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now