ప్రాణుల లక్షణాలు.. మనుషుల భ్రమలు..?

ప్రాణుల
Headlines:
  1. మనుషుల ప్రత్యేక లక్షణాలు
  2. జీవి పరిణామంలో మనిషి పాత్ర
  3. భ్రమలు మరియు అసత్యాలు
  4. ప్రకృతిలో పోటీపడే ప్రాణుల లక్షణాలు
  5. ఆధ్యాత్మికత మరియు ప్రకృతి
  6. మనిషి మరియు జంతువుల మధ్య తేడాలు

మనుషులు తక్కిన జంతువులతో పోలిస్తే అసాధారణ జీవులే. మనుషుల ప్రత్యేక లక్షణాలు, వారి మెదడు, బాగా పరిణతి చెందిన నాడీ వ్యవస్థ ముఖ్య కారణాలు. ఈ ప్రత్యేక లక్షణాల్లోనే కొన్ని తప్పులకు, నమ్మకాలకూ, బ్రమలకూ కూడా దారితీస్తున్నాయి. ప్రకృతిలో ఒక భాగంగా కాక, తనను ప్రత్యేక సృష్టిగా, మొత్తం ప్రాణకోటికి పరాకాష్టగా భావించే మనిషి, అసలు ఎలా పరిణామం చెందాడో తెలిస్తే జీవరాశిని గుర్తించిన సరైన అవగాహన ఏర్పడుతుంది. ఎందుకంటే ఆధ్యాత్మిక వివరణలను పట్టించుకోకుండా, సహజ విషయాల గురించి సైతం, ఉన్నవి, లేనివి కల్పించుకొని గందరగోళ పడకుండా జీవించడం చాలామందికి అసాధ్యం అనిపిస్తుంది.

జీవ సృష్టిని అర్థం చేసుకోవటం కష్టమేమీ కాదు. మొదట ఏకకణ జీవుల రూపంలో భూమి మీద ఉద్బవించిన జీవరాశి, క్రమంగా బహుకణ సముదాయాలతో కూడిన ప్రాణుల ఆవిర్భావానికి దారితీసింది. ఇదంతా సముద్రజలాల్లో వందల కోట్ల సంవత్సరాల తరబడి జరిగిన పరిణామం. రకరకాల వింత జంతువులతో లుకలుక లాడినా ఆనాటి సముద్రాల నుంచి, బురద తో నిండిన జలాశయాల నుంచి జలచరాలు పుట్టుకొచ్చాయి. మారుతున్న భౌగోళిక వాతావరణ పరిస్థితుల్లో, అంతకంతకూ పోటీ పెరిగి, బయటి మార్పులకు తట్టుకోగలిగిన శారీరక లక్షణాలు కలిగిన ప్రాణులు మాత్రమే బ్రతక గలిగాయి. వీటిలో కొన్ని చిత్ర విచిత్రమైన రూపాలను సంతరించుకున్నాయి. భౌతిక కారణాలు, ప్రేరణలు లేకుండా ఏ మార్పు జరగలేదు. దైవ శాసనాలు అమలు అయినట్టు దాఖలాలు ఏవి లేవు. చిన్న చిన్న విషయాల్లో కూడా ఇది స్పష్టమవుతుంది. పైనున్న వీపు భాగం ముదురు రంగులతోను, క్రింది పొట్ట తేలిక రంగుతోను అనేక రకాల చేపలు కనపడతాయి. ఇలా జరగడం వల్ల పైన ఎగిరే పక్షులకు వాటిని గుర్తించడం కష్టం. అలాగే వాటికి ఎర అయ్యే చిన్న చేపలకూ కింద ఈదు తున్నప్పుడు వాటిని గుర్తించడం కష్టమే. తమను అపాయం నుంచి కాపాడుకుంటూ, తమకు అవసరమైన ఆహారాన్ని తేలికగా సంపాదించుకుంటూ బతకడానికి అవసరమైన రంగులు ఆ చేపలకు దక్కాయి. ఇలాంటి మార్పులు చెంది లేని చేపలు అంతరించిపోయాయి.

ఎవరు ఎంపిక చేసినట్టుగా అనిపించే ప్రాణుల లక్షణాలన్నీ, యాంత్రికంగా జీవపరిణామ పోటీలో ఏరివేత ద్వారా మిగిలినవేనని చాలామంది గుర్తించరు. దీనికి తోడుగా మనుషులకు మహిమల గురించి సహజంగా కలిగే భ్రమలు కొన్ని ఉంటాయి. ఏ వంకాయలోనో అడ్డంగా కోసినప్పుడు, అందులోని గింజలు ఓమ్ అనే ఆకారంలో కనబడగానే కొందరు పరవశించిపోతారు. దాని వివరాలు, ఫోటోలు పత్రికలకు ఎక్కుతాయి. అదే కాయ ను మరొక దిశలో కోసిఉంటే గింజల ఏర్పాటు లో ఎటువంటి మహత్తు కనపడి ఉండేది కాదని వారికి తట్టదు.

ఒక పూల మొక్క రెమ్మల్లో ఒక ఫోటోగ్రాఫర్ “ఓం” స్వరూపాన్ని గుర్తించాడు. మన దేశపు పక్షి “కృష్ణా” అని అరుస్తుందట. ఇటువంటి అపోహలు అన్ని మతాల్లోనూ కనిపిస్తాయి. కొన్ని చెట్ల గుంపులనో, తేనెపట్టు స్వరూపాన్నో చూచినప్పుడు అందులో అల్లా అనే అరబిక్ అక్షరాలు కనబడిన ధాకలాలతో ఫోటోలు ఉన్నాయి. కొందరికి దీపాల కాంతుల లో సిలువ వెలుగుతున్నట్టు గా కనిపించింది. ఆశ్చర్యానందాలు కలుగుతాయి. మానవ సమాజాలు శైశవ దశలో ఉన్నప్పుడు, వారి మనస్తత్వం చిన్నపిల్లలను పోలి ఉండేదని, చారిత్రక విజ్ఞాన పరిశోధనలు తెలుపుతున్నాయి. ఆ స్థితి ఈనాటికి కొనసాగుతోంది అనటానికి ఈ ఉదాహరణలు చాలు.

వంగ గింజలైనా తేనెపట్లయినా తలవని తలంపుగా వాటిలో కనబడుతున్న సహజ రేఖలు ఏవో కొన్ని లిపుల్లో అర్థవంతమైన మాటలు గా కనబడినంత మాత్రాన వాటికి ఎటువంటి ప్రాముఖ్యత కలగదు. ఈ మధ్య తలెత్తిన రామసేతువు రభసలో సముద్రాల్లో సహజంగా జరిగే పరిణామాలను గురించిన ప్రస్తావన వచ్చింది. కొందరు ప్రబుద్ధులు ‘చూడగలిగిన వాళ్ళకి భగవంతుడి మహిమలు ఎల్లెడలా కనిపించవు’ అని ప్రవ చిస్తూ ఉంటారు. కొన్నేళ్ళ క్రితం ఒక ప్రముఖ వారపత్రిక తిరుపతి దర్శనాలు అనే శీర్షికను ప్రతివారం ప్రచురించేది. బుద్ధిపూర్వకంగా బ్రమ లను ప్రోత్సహించడమే అందులోని ఉద్దేశం.

కాశ్మీర్ ప్రాంతపు అమర్నాథ్ శివలింగం సహజంగా మంచు వల్ల రూపొందిన ఆకారం. స్టాల గ్మైట్ అనబడే ఇటువంటి సున్నపురాతి ఆకారాలు ప్రకృతిసిద్ధంగా గుహల్లో ఏర్పడతాయి. ఎన్నో శతాబ్దాల క్రిందట ప్రజల మనసును ఛలింప చేసిన ఇటువంటి’ వింతలు’ ఈ నాటికీ తమ ఆధ్యాత్మిక శక్తితో యాత్రా స్థలాలుగా కొనసాగుతున్నాయి. కొన్ని సంఘటనల్లో, ఇలాంటి మార్పులకు మనిషి ప్రమేయం కూడా ఉంటుందని చెబుతూ కార్ల్ సేగన్ మరొక విషయం ప్రస్తావించాడు. జపాన్ దీవుల్లో ఒకచోట సామ్ రాయ్ యోధుల మొహాల డిజైన్ వీపు మీద కలిగిన ఎండ్రకాయలు విరివిగా దొరుకుతాయట. సమురాయ్ యోధులు అంటే అక్కడి వారికి ఎంతో గౌరవం. కనక అలాంటివి దొరికినప్పుడు జాలర్లు వాటిని చంపకుండా మళ్ళీ సముద్రంలో వదులుతారట. ఎండ్రకాయ ల వీపు మీద ఉండే మచ్చలు జన్యువుల నిర్మాణాన్ని బట్టి రకరకాలుగా రూపుదిద్దుకుంటాయి. వాటిలో కొన్నింటికి యాదృచ్చికంగా సామ రాయ్ యోధుల మొహాల్ల డిజైన్ ఏర్పడటంతో వాటి ప్రాణాలు దక్కాయి. ఇతర డిజైన్లు ఉన్న పీతలన్నీ ఆహారం అయిపోయాయి. ఆ విధంగా శతాబ్దాలుగా ఈ మార్కు పీతల జనాభా ఎక్కువగా పెరిగి ఆ లక్షణాలు బలపడే అవకాశం కలిగింది. ప్రకృతితో ఈ మచ్చల రూపం అనేక రకాలుగా మారుతూ ఉంటుంది. మనిషి తన స్థానిక సంస్కృతిని బట్టి, మంచి చెడు అనుకుంటూ ఆ మార్పుల్లో జోక్యం చేసుకున్నాడన్న మాట. అయితే ప్రస్తుత పరిస్థితిని బట్టి, అదేదో పవిత్ర స్థలం, అవన్నీ పవిత్రమైన పీతలు అనే అపోహ మాత్రం తప్పక కలుగుతుంది.

ఇంగ్లాండ్ లో పారిశ్రామిక యుగం మొదలు కానప్పుడు, తెల్లని ఉన్న చెట్ల, మీద తెల్లని సీతాకోకచిలుకలు వాలుతూ ఉండేవి. వాటిని తినే పక్షులకు వాటిని గుర్తించడం కష్టం అయ్యేది. బొగ్గు, ఆవిరి యంత్రాలు రావడంతో త్వరలోనే ఇంగ్లాండ్ పరిసరాలన్నీ మసిబారడం, చెట్లన్నీ నల్లబడటం జరిగింది. ఈ విప్లవం వల్ల ఎవరికి మేలు జరిగినా తెల్లని సీతాకోకచిలుకలన్నీ పక్షులకు బలయిపోయాయి. ఇక మిగిలినవి నల్లని వి మాత్రమే. తెల్లని స్థానంలో నల్లనివి ప్రత్యక్షం కావడం ఆనాటి శాస్త్రజ్ఞుల లు కళ్లరా చూసి, పరిణామ వాదాన్ని అర్థం చేసుకోగలిగారు. ఎటొచ్చి ఇందులో మరికొన్ని అంశాలు కూడా ఉండవచ్చని ఆధునిక పరిశీలకులు అంటున్నారు గానీ, డార్విన్ ప్రతిపాదనకు డోకా లేదు.

ఈనాటి అపోహలకు ఎన్నో రూపాలు ఉన్నాయి. వీటిలో కొన్ని జెనిటిక్ పరిశోధనలకు సంబంధించినవి. ఇందులో వ్యాపార దృష్టి లేకపోలేదు గాని, సైన్స్ విషయాలను కూడా గుర్తించాలి. మనిషి జంతువుల ని మచ్చిక చేసుకోవడం, వ్యవసాయము మొదలుపెట్టాక ప్రకృతిలో జోక్యం చేసుకోవడం మొదలైంది. ప్రకృతిలో పెరిగే ధాన్యాలు, కాయగూరల్లో యాదృచ్ఛికంగా, జన్యువుల్లో తలెత్తే మ్యుటేషన్ ల వల్ల,చేదువి, పనికిరానివి,గిడసబారినవి కూడా ఉంటాయి. అలా కాకుండా మనుషులు ప్రకృతికి విరుద్ధమైన పనులు ఏనాడో ఈనాడు క్లోనింగ్, జన్యుపరంగా ఆహార పదార్థాల్లో మార్పు వగైరాల గురించి ఆందోళన పడి హడావుడి చేస్తున్న వారు ఈ విషయాలు మరవరాదు. మొదట కుక్కలనూ, తరువాత మేకలు, పశువులను మచ్చిక చేసుకున్న ఆదిమ మానవులు, వాటిలో మంచినగ, సౌమ్యంగా ఉండే జంతువులను ఎంచుకున్నారు. పొగరుబోతు లను, తిరుగుబాటు లక్షణాలను కలిగిన వాటిని చంపేస్తూ వచ్చారు. మిగిలిన వాటి సంతతికి అవే లక్షణాలు వచ్చాయి. ఈ విధంగా మనుషులకు అనువైనవి, పనికి వచ్చేవి మాత్రమే పెంపుడు జంతువులు అయ్యాయి. వ్యవసాయానికి ముందు చేరుకునే దశలో, మైదానాల్లో మొలిచే గింజలనే మనుషులు తిన్నారు. వ్యవసాయం మొదలయ్యాక వాటిలో మంచి వాటిని ఎంపిక చేసి “నారు’ పోయడం ప్రారంభమైంది. ధాన్యాలే కాదు, కూరగాయలు, తినడానికి పనికొచ్చే జంతువులు అన్ని ఎంపిక చేయబడ్డాయి. దీనికి, క్లోనింగ్ కు పెద్దగా తేడా లేదు అనుకోవాలి. ఈ ఉదాహరణలు అన్నీ ప్రకృతి లో జరిగే పోటీలకు, మనుషులు అడ్డుపడిన సంఘటనలే.

ఎన్ని కోట్ల సంవత్సరాల క్రితమై నా ప్రాణుల శారీరక లక్షణాలు ఇటువంటి పోటీ తత్వం వల్లనే మార్పులు చెందుతూ వచ్చాయి. వీటికి మూల కారణాలు బాహ్యి పరిస్థితులే. కొన్ని వేల సంవత్సరాలకు ఒకసారి వచ్చే హిమపాతాలూ, ఆకస్మాత్తుగా ఎగిసిపడే అగ్నిపర్వతాలు, స్థానికంగా ఎంతో ఉత్పాతన కలిగించాయి. ఉష్ణోగ్రతలోనూ, తేమలోనూ, కొద్దిపాటి మార్పులు జరిగినా తట్టుకోలేని చిన్న జీవాలు, క్రిమికీటకాలు, ఎన్నో వాటిని తింటూనో, వాటి మీద ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పెద్ద జంతువులు, అంతరించి పోయే ప్రమాదం ఎల్లప్పుడు ఉండేది. ప్రకృతితోనూ, ఇతర ప్రాణుల తోనూ ఎప్పటికప్పుడు పోటీపడుతూ, తట్టుకోవడానికి అనుగుణమైన లక్షణాలున్న జీవాలు బతికాయి. ఇది చెట్ల విషయంలోనూ కనబడుతుంది. పెద్ద పెద్ద చెట్లు ఏతుఫాను వల్లనో పడిపోయాక, దాని నీడలో ఇంతకాలం ఎదగలేని, గడ్డి , పిచ్చిమొక్కలు ఎండ తగిలి ఏపుగా పెరుగుతాయి. మొక్కలు మనిషి తోనూ పోటీ పడగలవు. వాడకుండా పాడు పెట్టిన ఇళ్లలో మొక్కలు, తీగలు పెరిగి అల్లుకోవడం మనకు తెలిసినదే.

ప్రాచీన యుగంలో భూమిమీద ప్రాణులు ఎలాంటి పరిణామాలకు లోనయ్యాయి? దీనికి స్పష్టమైన సమాధానం లేదు. ఉన్నదల్లా శిలాజాల సాక్ష్యమే. ఉదాహరణకు మొప్పలున్న చేపల గురించి బోలెడు సమాచారం ఉంది. అలాగే కాళ్లున్న తొండలున్న ఉభయచరాల గురించి తెలిసిందే. మరి బురద నీరు ఎండిపోవడంతో, తప్పనిసరిగా నేల మీద అడుగు పెట్టిన మొదటి కాళ్లు ఉన్న చేప మాటేమిటి? అరుదైన దాన్నే శిలాజం ఈ మధ్యనే దొరికిందట. ఈ దశ త్వరలోనే పూర్తయి ఉండాలి. అందుకనే ఇలాంటి జీవాల సాక్షాలు దొరకటం లేదు. జల ప్రపంచంలో చాలాకాలం రాజ్యం చేసిన జీవరాశి, ఒకసారి నేల మీద కాలు మోపినతర్వాత మొప్పల స్థానంలో గాలిని పీల్చ గలిగిన ఊపిరితిత్తులు సంపాదించుకొని, అభివృద్ధి చెంది ఉంటుంది. ఆ ప్రస్థానానికి ఇక తిరుగు లేదు. నీటి ఎద్దడి లేని ప్రాంతాల్లో జలచరాలు కొనసాగాయి. అభివృద్ధి కూడా చెందాయి.

రకరకాల ప్రాంతాల్లో జరిగిన మార్పుల కారణంగా, జంతు ప్రపంచం లో వైవిధ్యం పెరిగింది, అంతే. ఎప్పుడైనా, ఎక్కడైనా ఎన్ని వింత ఆకారాలతో, ఎన్ని రంగులతో, ఎటువంటి ప్రాణీ, లేదా దాని అవశేషాలు కనిపించినా శాస్త్రవేత్తలు దాని పుట్టు పూర్వోత్తరాలనూ, జన్యు స్థాయి ఎక్కువమంది’ ఏ పుట్టలో ఏ పాముందో ‘అనే పద్ధతిలో ఆలోచిస్తూ, మహిమల కోసం వెతుకుతూ ఉంటారు. వింత ప్రాణులనో, తలవని తలంపుగా, ప్రకృతిలో తలెత్తి మనకు పరిచితమైన సంకేతాలుగా అనిపించే విశేషాలనోచూచి ఉలిక్కి పడడం, నోరు వెళ్ళబెట్టి భగవంతుడి లీలలను గురించి ఆలోచించడం, ఆధునికులు చేయదగిన పనులు కావు.

____________ముగిసింది____________

¢. 23. మనిషి ఆయురారోగ్యాలు.

Join WhatsApp

Join Now