రక్షకభటుల్లో ఆణిముత్యం మరొక తల్లికి ఆర్థిక సాయం.

రక్షకభటుల్లో ఆణిముత్యం మరొక తల్లికి ఆర్థిక సాయం.

మైలవరం నియోజకవర్గం కొండపల్లి మున్సిపాలిటీ, ఇబ్రహీంపట్నం..

IMG 20240912 WA0060

విష జ్వరాలు ప్రబలి 12 ఏళ్ల బాలుడు మృతి చెందిన విషయం తెలుసుకున్న కానిస్టేబుల్ సుబ్రహ్మణ్యం ఆ తల్లి కడుపుకోతను తీర్చలేను కానీ మానవత్వాన్ని చాటుకుని నా వంతు ఆర్థిక సాయం అందిస్తున్నాను అంటూ ఆ తల్లిదండ్రులకు ఆర్థిక సాయం అందించారుగత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రబలుతున్న విష జ్వరాలు విష జ్వరాల ధాటికి 12 ఏళ్ల పాలపర్తి జాన్ వెస్లీ అనే చిన్నారి బాలుడు మృత్యువాత పడ్డాడు…పాలపర్తి చంటి మరియు పాలపర్తి రూతు లకు ఇద్దరు మగ పిల్లలు వారిలో చిన్నవాడైన పాలపర్తి జాన్ వెస్లీ గత ఐదు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు ప్రస్తుతానికి వైద్యులు గ్రామ గ్రామాన ఇంటింటికి వెళ్లి క్షేమ సమాచారం తెలుసుకొని వారికి కావలసిన మందులు ఉచిత వైద్యం అందిస్తూనే ఉన్నారు కానీ జ్వరం తీవ్రతతో బాలుడు రాత్రి 11 గంటలకు సమయంలో మృతి చెందాడు అని స్థానికులు తెలుపుతున్నారు. పారిశుద్ధ్యం కారణంగా దోమ కాటుతో భీమరాజు గుట్ట 24వ డివిజన్ పులి అరుణకుమారి దాస్ వార్డులో ఈ ఘటన చోటుచేసుకుంది.మృతుని కుటుంబానికి తక్షణ సాయం అందించాలీ

Join WhatsApp

Join Now