రాంపల్లిలో ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం — పునర్నిర్మాణానికి కిరణ్ గౌడ్ 50 వేల విరాళం

రాంపల్లిలో ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం — పునర్నిర్మాణానికి కిరణ్ గౌడ్ 50 వేల విరాళం

మేడ్చల్ జిల్లా నాగారం ప్రశ్న ఆయుధం అక్టోబర్ 18

నాగారం మున్సిపాలిటీ పరిధిలోని రాంపల్లి గ్రామంలోని శ్రీ రాములవారి ఆలయంలో శనివారం చోటుచేసుకున్న అపవిత్ర ఘటన గ్రామంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆలయంలోని ఆంజనేయ స్వామి విగ్రహం చేతిని గుర్తు తెలియని దుండగులు విరగొట్టడంపై గ్రామ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ ఘటన వివరాలు తెలిసిన వెంటనే, ‘మేము ఫేమస్’ సినిమాలో సర్పంచ్ పాత్రలో నటించి ప్రత్యేక గుర్తింపు పొందిన మచ్చ కిరణ్ గౌడ్ శనివారం రాంపల్లి ఆలయాన్ని సందర్శించారు. ఆయన విగ్రహ ధ్వంసం జరిగిన తీరును ప్రత్యక్షంగా పరిశీలించి, గ్రామస్తులతో మాట్లాడి వారి ఆవేదనను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా, కిరణ్ గౌడ్ ఆంజనేయ స్వామి విగ్రహం పునర్నిర్మాణం మరియు ఆలయ పునరుద్ధరణ కోసం స్వయంగా ముందుకు వచ్చి రూ. 50,000/- (యాభై వేల రూపాయలు) విరాళంగా ప్రకటించారు.

కిరణ్ గౌడ్ చేసిన ఈ ఉదారత గ్రామ ప్రజల్లో ఆనందాన్ని నింపగా, ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ “శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం మరింత వైభవంగా తీర్చిదిద్దబడాలని” గ్రామస్తులు ఆకాంక్షించారు.

ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిపై తక్షణమే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు అధికారులను కోరారు.

Join WhatsApp

Join Now