మెదక్/నర్సాపూర్, మే 22 (ప్రశ్న ఆయుధం న్యూస్): హత్నూర మండలం గుండ్లమాచునూరు గ్రామానికి చెందిన పీఏసీఎస్ డైరెక్టర్ బేగరి సాయిలు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో ఆ కుటుంబాన్ని గురువారం మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ రిజ్వాన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్, వెంకటేశం, బాధిత కుటుంబీకులు మాల మహానాడు అధికార ప్రతినిధి యాదగిరి, జర్నలిస్ట్ శ్రీహరి, మహేష్, నాగరాజు, విక్రమ్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
పీఏసీఎస్ డైరెక్టర్ కుటుంబాన్ని పరామర్శించిన ఆంజనేయులుగౌడ్
Published On: May 22, 2025 6:24 pm
