మెదక్, నర్సాపూర్, సెప్టెంబరు 11 (ప్రశ్న ఆయుధం న్యూస్): నర్సాపూర్ పట్టణంలో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా అయోధ్య సేనా, ప్రీ సోల్స్ యూత్, శ్రీ సంత్ సేవాలల్ మహారాజ్ ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో పూజలు నిర్వహించి, అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ గుప్తా, నర్సాపూర్ మాజీ ఎంపీపీ జ్యోతి సురేష్ నాయక్, నర్సాపూర్ బ్లాక్ అధ్యక్షుడు రిజ్వన్, మండల అధ్యక్షుడు మల్లేష్, రుస్తుంపేట్ మాజీ ఎంపీటీసీ అశోక్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఉదయ్ కుమార్, మండల ఉపాధ్యక్షుడు నర్సింలు, మండల ఓబీసీ సెల్ అధ్యక్షుడు అశోక్ గౌడ్, మండల మైనారిటీ సెల్ అజ్మాత్, సుధీర్ కుమార్ గౌడ్, యాదగిరి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
వినాయక నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న ఆంజనేయులుగౌడ్
Updated On: September 11, 2024 6:49 pm
