వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్మన్ అంజవ్వ గణేష్
ప్రశ్న ఆయుధం 01 ఏప్రిల్ ( బాన్సువాడ ప్రతినిధి)
బాన్సువాడ సొసైటీ పరిధిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ మంత్రి అంజవ్వ గణేష్ ప్రారంభించారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… రైతులు వరి ధాన్యన్ని దళారులకు అమ్మి మోసపోవద్దని సూచించారు.ప్రతి గింజ కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో పాత బాన్సువాడ సొసైటీ చైర్మన్ ఎర్వాల కృష్ణారెడ్డి,కాంగ్రెస్ నాయకులు వెంకన్న గుప్తా రైతులు తదితరులు పాల్గొన్నారు.