ప్రశ్న ఆయుధం న్యూస్ దమ్మపేట మండల ప్రతినిధి సెప్టెంబర్ 17
దమ్మపేట మండల కేంద్రంలోని లయన్స్ క్లబ్ వైరా వైద్యుల ఆధ్వర్యంలో దమ్మపేట విజన్ సెంటర్ వద్ద మంగళవారం ఏర్పాటు చేసిన కంటి పరీక్షా శిబిరాన్ని లయన్స్ క్లబ్ అధ్యక్షులు అంకత ఉమామహేశ్వరరావు రిబ్బన్ కట్ చేసి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా 120 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా 18 మందికి కంటి ఆపరేషన్ అవసరం ఉన్నట్లు వైద్యులు తెలిపారు .ఈ క్రమంలో ఈనెల 20వ తేదీన దమ్మపేట లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వైరా లయన్స్ కమిటీ ఆసుపత్రిలో ఆపరేషన్లు నిర్వహించుచున్నామని క్యాంప్ చైర్మన్ లయన్ దార యుగంధ తెలిపారు .ఈ సందర్భంగా లయన్ క్లబ్ అధ్యక్షులు అంకత ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ గతంలో లయన్స్ క్లబ్ ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను నిర్వహించామని. సేవా దృక్పథంతో ముందుకు వెళ్తున్నామని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి మంచి సేవలు చేస్తామని ప్రజలకు సాయం చేసే అవకాశం వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందని మాట్లాడారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో త్వరలో కమిటీ ప్రమాణస్వీకారం అనంతరం ప్రజలకు ఉపయోగపడే స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను నిర్వహించుచున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సెక్రటరీ రాచూరి వేణుగోపాలరావు ,ట్రెజరర్ పసుమర్తి ముక్తేశ్వరరావు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ దారా మల్లికార్జునరావు, ఆర్యవైశ్య యువ నాయకుడు పైడి సాయికుమార్ ,కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు చామర్తి గోపీశాస్త్రి, ఆర్యవైశ్య మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.