శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ ఆలయంలో అన్నదానం
ప్రశ్నాయుధం న్యూస్, అక్టోబర్ 01, కామారెడ్డి :
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కల్కి నగర్ లో గల శ్రీ పరంజ్యోతి భగవతి భగవానుల ఆలయంలో మంగళవారం సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కుప్రియాల్, ముత్యంపేట్ గ్రామాలకు చెందిన ఎర్రం నారాయణ లక్ష్మి, పైడి చంద్రశేఖర్ పద్మ దంపతులు అన్నదాతలుగా వ్యవహరించారని, వారికి కల్కి మానవ సేవా సమితి తరపున సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారన్నారు. అన్నదాన కార్యక్రమానికి దాతలు ముందుకు రావాలని ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, ఈ అన్నదాన కార్యక్రమానికి 350 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించడం జరిగిందన్నారు. అన్నదానం చేయాలనుకున్న వారు మరిన్ని వివరాల కోసం ఎర్రం చంద్రశేఖర్ ను 98496 01438 ను సంప్రదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎర్రం చంద్రశేఖర్, శ్రీనివాస్,ఎర్రం విజయ్ కుమార్, ఆలయ సేవకులు భక్తులు పాల్గొన్నారు.