అన్ని దానాల్లో అన్నదానం మహాదానం
టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు
కొత్తగూడెం ( ) వినాయక నవరాత్రుల ఉత్సవాలు ముగిసిన నేపథ్యంలో కొత్తగూడెం మున్సిపాలిటీ 27వ వార్డు లోని మిలీనియం క్వార్టర్స్ వద్ద ఏర్పాటు చేసిన సిద్ధి వినాయక మండపం వద్ద నిర్వాహకులు ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో నాగా సీతారాములు పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు.ఈ కార్యక్రమములో మున్సిపల్ కౌన్సిలర్ ప్రసాద్,జిల్లా మైనారిటీ ఉపాధ్యక్షులు కరీంపాషా,OBC కొత్తగూడెం పట్టణ అధ్యక్షులు జయప్రకాష్,బొబ్బాల.వెంకట యాదవ్,చందు మరియు నిర్వాహక కమిటీ సభ్యులు పాల్గొన్నారు.