Site icon PRASHNA AYUDHAM

వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్న అన్నాలెజినోవా.

IMG 20250414 WA21331

*తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పవన్ సతీమణి అన్నాలెజినోవా.*

*వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్న అన్నాలెజినోవా.*

*వైకుంఠం క్యూకాంప్లెక్స్ వద్ద స్వాగతం పలికిన టీటీడీ అధికారులు.*

*ఆలయంలో శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించిన అన్నాలెజినోవా.*

*దర్శన అనంతరం శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేసిన అధికారులు.*

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, అన్నా లెజీనోవాల తనయుడు శంక‌ర్ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడడంతో కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి తన మొక్కులు తీర్చుకున్నారు అన్నా లెజీనోవా. సోమవారం వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. స్వామివారి దర్శించుకుని తన మొక్కులు చెల్లించుకున్నారు.

పవన్, అన్నా దంపతుల తనయుడు శంకర్ కు సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదం నుంచి అదృష్ట‌వ‌శాత్తు చిన్న చిన్న గాయాలతో క్షేమంగా బయటపడ్డాడు. ఈ సమయంలో అన్నా స్వామివారిని మొక్కుకున్నదట. పవన్ అన్నా దంపతులు పిల్లలతో సింగపూర్ నుంచి భారత్ కు చేరుకున్నారు. ఈ నేపధ్యంలో స్వామివారి దర్శనం కోసం నిన్న(ఆదివారం) తిరుమలకు చేరుకున్నారు. జన్మతః క్రిస్టియన్ అయిన అన్నా కొడుకు కోసం తిరుమలకు చేరుకోవడమే కాదు తిరుమల శ్రీవారిని అన్యమతస్థులు దర్శించుకోవాలంటే ఉన్న నిబంధనలు పాటించారు. ముందుగా గాయత్రి సదనంలో డిక్లరేషన్‌పై లెజినోవా సంతకం చేశారు.

Exit mobile version